Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక ఆడపిల్లకు పెళ్లి అయిన తర్వాత తన పద్ధతిలో అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. వివాహమైన స్త్రీ మెడలో మాంగల్యంతో పాటు కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం అంటివి తప్పనిసరిగా ధరిస్తూ నిండు ముత్తైదువుగా ఉంటారు అయితే కాలికి మెట్టెలు ధరించే స్త్రీలు మెట్టలు ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఒక అమ్మాయికి పెళ్లి జరిగే సమయంలో తన మేనమామ కాలికి మెట్టెలు తొడుగుతారు. ఈ మెట్టెలు ధరించే తప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలి. వివాహిత పెళ్లి తర్వాత ధరించే మెట్టెలు చంద్రుని సూచిస్తాయి కనుక ఎప్పుడూ కూడా కాలికి రెండవ వేలిలో మెట్టెలు ధరించాలి. అయితే ఈ మెట్టెలు పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు.అలాగే వాటిని తీసి పక్కన పెట్టి పని మీద బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే పెడుతుంటారు కొందరు ఇలా అసలు పెట్టకూడదు.
Devotional Tips
ఇక పెళ్లయిన వారు వెండి మెట్టలను మాత్రమే కాలికి ధరించాలి.చాలామంది ధనవంతులు బంగారు మెట్టలను ధరిస్తారు ఇలా బంగారు మెట్టెలు కాలికి ధరించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. బంగారులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు అలాంటి లక్ష్మీదేవిని కాలు మెట్టెలుగా ధరించడం వల్ల అమ్మవారిని అవమానించినట్టేనని భావిస్తారు అందుకే మెట్టెలు ఎప్పుడూ కూడా వెండివే ధరించాల్సి ఉంటుంది బంగారు మెట్టెలను ధరించకూడదని పండితులు చెబుతున్నారు.