Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి ఇంటి పనులన్నింటిని పూర్తి చేసి చక్కగా స్నానం చేసి అనంతరం దీపారాధన చేస్తుంటారు. ఇలా దీపారాధన చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషంగా ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. అదేవిధంగా మన ఇంట్లో కూడా ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు.
ఇక దీపారాధన కొంతమంది ఉదయం 6 గంటలకు చేయాలని భావిస్తుంటారు. మరికొందరు 10 గంటల లోపు పూర్తి చేస్తుంటారు. అయితే ఇంతలోపే పూజ చేయాలని నియమాలు ఏమీ లేవు.అలాగే మరి కొంతమంది ఏ విధమైనటువంటి అల్పాహారం తినకుండా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతూ కనీసం కాఫీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన అనంతరం కాఫీ టిఫిన్స్ చేయడం చేస్తుంటారు. నిజంగానే టిఫిన్స్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది.
Devotional Tips:
అయితే తిని మనం పూజ చేయవచ్చా లేదా అనే విషయానికి వస్తే…ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.మధుమేహం డయాబెటిస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి వారు తప్పనిసరిగా ఉదయమే ఏదైనా అల్పాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అల్పాహారం తీసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి అనంతరం పూజలు చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పులేదని పండితులు చెబుతున్నారు. పూజ చేయడానికి కూడా ఓపిక లేకుండా నీరసించిపోయినటువంటి వారు మనసులో దేవుడిని పూజిస్తే చాలనీ పండితులు చెబుతున్నారు.