Thu. Jan 22nd, 2026

    Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల చెట్లను దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటాము.ఇలా పూజించే వాటిలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించడమే కాకుండా సకల దేవతలు కూడా ఈ రావి చెట్టులో కొలువై ఉంటారని భావిస్తారు. ఇలా పవిత్రమైన రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల ఎన్నో రకాల దోషాల నుంచి బయటపడటమే కాకుండా ఆర్థిక ఎదుగుదల కూడా ఉంటుందని భావిస్తారు.

    ఈ క్రమంలోని గ్రహ దోషాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు రావి ఆకులతో ఇలా చేస్తే ఇబ్బందులని తొలగిపోతాయి.రావి చెట్టు ఆకులతో ఎలా పూజ చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడగాలి. అనంతరం దేవుడి ముందు పరచాలి. వాటిపై ఒక ప్రమిదను పెట్టాలి. అనంతరం అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఇలా రోజూ ఉదయాన్నే రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.

    Devotional Tips:

    ప్రతిరోజు ఇలా దీపం వెలిగించడం వల్ల మనం చేపట్టిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి.
    ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా పూర్వ జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే కర్మ ఫలితాన్ని కూడా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా శాప దోషాలు, ఇతర దోషాలు కూడా తొలగిపోయి సమస్యల సుడిగుండం నుండి బయట పడతారు. అలాగే అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి.