Devotional Tips: సాధారణంగా మనం భగవంతుడు అనుగ్రహం పొంది కాస్త సుఖ సంతోషాలతో సంపదలతో కలిగి ఉంటే తప్పకుండా అందుకు కృతజ్ఞతగా మనం మనకు ఉన్నటువంటి దానిలో కొంత భాగం పేదలకు దానధర్మాలు చేయడం వల్ల భగవంతుడి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తుంటారు. అందుకే హిందూ ధర్మంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.మన శక్తి సామర్థ్యాలను బట్టి పేదవారికి తగిన సహాయం అందించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. అయితే ఇలా తరచూ దానం చేసేవారు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకొని దానధర్మాలు చేయడం ఎంతో మంచిదని గరుడ పురాణం చెబుతుంది.
గరుడ పురాణం ప్రకారం దానధర్మాలు చేసే సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయానికి వస్తే… మనం ఇతరులకు దానం చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం దానం చేసే వస్తువులను ఎప్పుడు కూడా ఎడమ చేతితో వేయకూడదు. అలాగే ఇంట్లో చిరిగిపోయిన బట్టలు చెడిపోయిన అన్నం,చీపురు ఉప్పు అల్యూమినియం గిన్నెలు వంటి వాటిని ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ముఖ్యంగా సంధ్యా సమయంలో దానం మంచిది కాదు.
Devotional Tips:
మనం దానం చేసేటప్పుడు మన శక్తి సామర్థ్యాలను మన ఆర్థిక స్థితిగతులను గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా మనం సంపాదించిన దానిలో 10% మాత్రమే దానధర్మాలకు ఉపయోగించాలి అలా కాకుండా ఇష్టానుసారంగా దానధర్మాలు చేస్తూ పోతే ఏదో ఒకసారి మనం కూడా ఇతరుల వద్ద దానం చేయమని చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దానధర్మాలు చేయడం వల్ల మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండటంతో పాటు భగవంతుడు అనుగ్రహం కూడా మీపై ఉంటుంది.