Devotional Tip: సాధారణంగా మనం మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన కీర్తిసంపదలు పెరిగిన చాలామంది మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక పోతారు. ఇలా మన ఎదుగుదల చూసి ఇతరులు ఓర్చుకోకపోవడంతో వారి చెడు దిష్టి మనపై పడుతుంది ఇలా ఇతరుల చెడు దిష్టి మనపై పడినప్పుడు మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాము. ఇలా చెడు దిష్టి మనపై ఉన్నప్పుడు ఇతరుల చేత అవమానింపబడటం అలాగే ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది.ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనపై చెడు దిష్టి తొలగిపోవడం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు.
ఇలా ఇతరుల చెడు దిష్టి మనపై ఉన్నప్పుడు లేదా దిష్టి ప్రభావం మనపై ఉండకూడదు అనుకుంటే మనం ప్రతిరోజు ఉదయం స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయడం ఎంతో మంచిది.అదేవిధంగా ఉప్పు తీసుకుని మనకు నాలుగు వైపులా దిష్టి తీసుకొని దానిని నీటిలో పడేయడం వల్ల కూడా చెడు దిష్టి తొలగిపోతుంది. ఇక బూడిద గుమ్మడికాయను కూడా దిగదీసుకుని ఎవరూ చూడకుండా నీటిలో నిమజ్జనం చేయడం మంచిది.
ఇలాంటి చెడు దిష్టి ప్రభావాల నుంచి బయటపడాలి అంటే పడుకునే సమయంలో మూడు నిమ్మకాయలను తలదిండు కింద పెట్టుకొని నిద్రపోయి మరుసటి రోజు ఆ నిమ్మకాయలను బయటపడేయాలి.
Devotional Tip:
అదేవిధంగా ఒక తెల్లని కాగితంపై శ్రీరామ అని 108 సార్లు రాసి కాగితాన్ని తలదిండు కింద పెట్టుకోవడం వల్ల మనపై ఉన్నటువంటి చెడు దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది. ఇతరుల నరదిష్టి వలన విపరీతమైన సమస్యలని మీరు ఎదుర్కొంటున్నట్లయితే, అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరని, గాజులని ఇవ్వండి. ఈ విధమైనటువంటి పరిహారాలను పాటించడం వల్ల ఈ దిష్టి ప్రభావం నుంచి పూర్తిగా బయటపడవచ్చు.