Satyanarayan Vratham: సాధారణంగా మన హిందువుల ఆచార సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వ్రతాలు నోములు చేసే వారు కొన్ని సందర్భాలలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు చాలామంది ఈ వ్రతం చేసుకుంటారు. అలాగే నూతన గృహప్రవేశం చేసిన సమయంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే కొడుకుకు పెళ్లి జరిగిన తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం వారిచేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ విధంగా ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు కానీ కొత్త కోడలు రాగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తూ ఉంటారు. మరి కొత్త కోడలు, కొడుకు చేత ఈ వ్రతం చేయించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..నష్టాలు, బాధల నుండి బయట పడేసే శక్తి సత్యనారాయణ వ్రతంకు ఉంది.అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది.
సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగిన ఉన్నారని భక్తుల నమ్మకం. కొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ ఈ వ్రతం చేయిస్తారు. అంతేకాకుండా ఈ వ్రతం కోసం ఊరిలో వాళ్లు కూడా వస్తారు కనుక వారికి కూడా తమ కోడలను పరిచయం చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతోనే కొత్తకోడలి చేత ఈ వ్రతం చేయిస్తారు.