Gavvalu: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల చెట్లను పక్షులను జంతువులను కూడా మనం పూజిస్తూ ఉంటాము. అయితే చాలామంది ఇంట్లో గవ్వలను పెట్టి కూడా పూజిస్తూ ఉంటారు ఇలా గవ్వలను పెట్టి పూజించడం మంచిదేనా ఒకవేళ గవ్వలను పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. పురాణాల ప్రకారం గవ్వలను పూజించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. గవ్వలు సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరి సోదరులతో సమానమని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం సాగరం మదనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవితో పాటు సముద్ర గర్భం నుంచి గవ్వలు శంకువలు కూడా రావడంతో వీటిని లక్ష్మీదేవికి సోదరీ సోదరులుగా భావిస్తూ ఉంటారు.గవ్వలను లక్ష్మీదేవి చెల్లెళ్లుగా, శంఖువు లను తమ్ముళ్ళుగా భావించి పూజ చేస్తుంటారు. కొత్తగా కట్టిన ఇంటి గుమ్మానికి గవ్వలను కడితే, లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి, గవ్వలు ఆడడం కూడా కొన్ని కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తోంది.
నగదు పెట్టెలో గవ్వలను ఉంచితే లక్ష్మీదేవి పదిలంగా ఉంటుందని, పూజా మందిరంలో ఉంచితే లక్ష్మీదేవి ఇంట తాండవిస్తుందని కూడా భావించి, ఇలా పూజలు నిర్వహిస్తుంటారు. నల్లని తాడుతో గవ్వ లను ఉంచి పిల్లల మెడలో వేస్తే, దుష్ట గ్రహాలు దరిచేరవని, పిల్లలపై ఏ విధమైనటువంటి చెడు దృష్టి ప్రభావం కూడా ఉండదని పండితులు చెబుతున్నారు అందుకే గవ్వలను పూజించడం ఎంతో మంచిదని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్పాలి.