Dengue: వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల పెరుగుదల అధికంగా ఉంటుంది దోమలు ఒకేసారి వంద నుంచి 300 గుడ్ల వరకు పెట్టడమే కాకుండా గుడ్లు పెట్టిన ఐదు రోజులకే అవి దోమలుగా మారుతాయి. దీంతో వర్షాకాలంలో దోమలు బెడద అధికంగా ఉంటుంది అందుకే వర్షాకాలం అయినప్పటికీ మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ఎక్కడ నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక దోమలు విజృంభించడం వల్ల డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఎడిస్ దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే దోమలు కుట్టిన వెంటనే మనకు జ్వరం రాదు కానీ ఈ దోమకాటుకు గురైన ఐదు రోజులకు జ్వరం రావడం మొదలవుతుంది. ఈ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ అంటే ప్రాణాంతకరమైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
డెంగ్యూ జ్వరం దోమ కాటుక గురైన ఐదు రోజులకు వస్తుంది ముందుగా జ్వరం రావడం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి పొక్కులు, కళ్ల కింద నొప్పి, మోకాళ్ల నొప్పులు, వాపులు, దంతాలు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటివి గమనించినట్లయితే ఇవి కచ్చితంగా డెంగ్యూ లక్షణాలే ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం. ఇలా దోమ కాటు వల్ల డెంగ్యూ వస్తుంది కనుక దోమలు నిల్వ లేకుండా చేసుకోవడమే నివారణ ఇంట్లో పరిశుభ్రంగా ఉంచాలి పూల మొక్కలు కుండీలు వంటి వాటిలో చెత్తచెదారం లేకుండా నీరు నిల్వకుండా చూసుకోవాలి సాయంత్రం అయ్యేటప్పటికీ దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దోమతెరలను కూడా వాడటం వల్ల వీటిని నివారించవచ్చు.