Deepika-Ranveer : దీపిక, రణ్‌వీర్‌ల నిజ స్వరూపం ఇదే! కరణ్ షోలో అడ్డంగా బుక్ అయ్యారుగా

Deepika-Ranveer : బాలీవుడ్ తారల లవ్ అఫైర్లు, బ్రేకప్పులు, రిలేషన్స్, డివోర్సుల గురించి ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటుంది. నిత్యం బాలీవుడ్ తారలు ఏదో ఒక విషయంలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. చోటామోట తారలే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలు, సీరియర్ నటులు సైతం నెట్టింట్లో ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ రణ్‎బీర్ కపూర్, కత్రినా కైఫ్, దీపిక పదుకొణె వంటి సెలెబ్రిటీల అఫైర్లు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఎన్ని లవ్ అఫైర్లు కొనసాగించినా, బ్రేకప్ అయినా చివరకు రణ్‌బీర్ కపూర్ అలియా భట్‌లు పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ మధ్యనే తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఇక బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణెలు కూడా పెళ్లి బంధంతో కలిసిపోయిన విషయం తెలిసిందే. కత్రినా కైఫ్ ఎట్టకేలకు తనను ప్రేమించిన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ సెలబ్రిటీలందరికీ బ్యాక్ గ్రౌండ్ లో భయంకరమైన గతాలు, బ్రేకప్‌లు, లవ్ స్టోరీలు ఉన్నాయి. అవన్నీ మరిచిపోయి వారి ప్రజెంట్ లైఫ్ లో చాలా ఆనందంగా గడుపుతున్నారు.

deepika-ranveer-star-couple-sensational-comments-at-coffee-with-karan-show

అయితే లేటెస్టుగా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు తమ యానివర్సరీ సందర్భంగా బాలీడుడ్ ఫేమస్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8కు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. వీరిద్దరు కరణ్ షోకు రావడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ వీరిద్దరే కరణ్ షోలో పాల్గొన్నారు. అయితే గతంలో రణ్‌వీర్ నటి అనుష్క శర్మ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో.. అప్పుడు ఆమె గురించి ఏం చెప్పాడో లేటెస్టు ఎపిసోడ్ లో దీపిక పదుకొణె విషయంలోనూ అవే కామోట్లు చేశాడు. తన డైలాగులు మారలేదు కానీ జస్ట్ పేరు మాత్రం మారింది. దీంతో రణ్ వీర్ అడ్డంగా బుక్ అయ్యాడు. నెటిజన్స్ కు మంచి వార్త దొరికినట్లైంది. దీంతో వీరు ఊరుకుంటారా చెప్పండి రణ్‌వీర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఇక దీపిక మాట్లాడిన మాటలు అయితే నెట్టింట్లో దారుణంగా ట్రోల్ అవుతున్నాయి.

deepika-ranveer-star-couple-sensational-comments-at-coffee-with-karan-show

గతంలో దీపిక కరణ్ షోలో డేటింగ్ అంటే ఏంటో తెలియదని, అసలు అదంటే ఇష్టం లేదన్నట్టుగా కామెంట్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం గతంలో తాను నలుగురైదుగురితో డేటింగ్ చేశానని అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అంతే కాదు ఆ రిలేషన్స్ నుంచి బయటపడిన తర్వాత వాటి అనుభవాల నుంచి బయటపడేందుకు కొన్నేళ్లు ఒంటరిగా ఉండాలని అనుకుందట. ఆ సమయంలోనే రణ్‌వీర్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పింది. దీంతో రణ్‌వీర్‌కు తాను కమిట్ అయ్యానని దీపిక కరణ్ షోలో తన ఇన్నర్ ఫీలింగ్స్ ను బయటపెట్టింది.

deepika-ranveer-star-couple-sensational-comments-at-coffee-with-karan-show

అంతే కాదు ఒకసారి ఒకరికి కమిట్ అయ్యాము అంటే , ఎవరిని చూసినా.. ఎవరు నచ్చినా, ఎగ్జైట్ అయినా కూడా మన మనసులో మాత్రం కమిట్ అయిన వ్యక్తే కనిపించాలని, ఉండాలని తెలిపింది. అలా తనకు తన హృదయంలో , మైండ్‌లో ఎప్పుడూ రణ్‌వీర్ ఉంటాడని, రణ్‌వీర్‌కే తాను కమిట్ అయ్యాయని తెలిపింది. దీంతో దీపికపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నువ్వు ఇన్ని లవ్ స్టోరీలు , ఎఫైర్లు నడిపావ్ కాబట్టే రణ్‌బీర్ వదిలేశాడని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇకమరికొంత మంది రణ్‌బీర్ కపూర్ బ్రేకప్పుల లిస్టును సైతం నెటిజన్లు మెళ్లిగా బయటకు లాగుతున్నారు.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.