Vastu Tips: సాధారణంగా చాలామంది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థం వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. అలాగే మరికొంతమంది దేవుడు గదిలో చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఇలా దేవుడి గదిలో పెట్టి పూజించడం మంచిదేనా.. ఒకవేళ చనిపోయిన వారి ఫోటోలను కనుక ఇంట్లో పెట్టుకుంటే వాస్తు పరంగా ఏ దిశలో పెట్టుకోవాలి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.
మరి చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో కనుక పెట్టినట్లయితే ఏ దిశలో పెట్టాలి ఏంటి అనే విషయానికి వస్తే..వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పూర్వీకుల చిత్రాలను ఉంచడానికి దక్షిణ దిశ అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దక్షిణ దిశను యముడి దిక్కుగా పరిగణిస్తారు. చనిపోయిన పూర్వీకుల ఫొటోలను దక్షిణ దిశలో పెట్టడానికి కారణం కూడా ఇదే.
దక్షిణ దిశ వైపు గోడకు వారి ఫోటోలను పెట్టగా ఆ ఫోటోల ముఖచిత్రం ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల వాస్తు పరంగా మంచిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. పూర్వీకుల ఫొటో పాతది అయినప్పటికీ, అది ముక్కలుగా ఉండకూడదు. పూర్వీకుల ఫొటోలను ఫ్రేమ్ చేసి మాత్రమే ఇంట్లో ఉంచండి. అలాగే ఫోటోలపై తెగిన లేదా పాడైన దండలను ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ పూర్వీకుల ఫొటోలు కూడా ఉండకూడదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.