Dead Body: పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇలా పుట్టిన ప్రతివారికి మరణం సంభవిస్తుంటుంది. ఇక ఒక మనిషి తల్లి కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి తనకు చేయవలసినటువంటి కార్యాలన్నీటిని కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేస్తారు. ఇలా పుట్టినప్పటినుంచి మరణించే వరకు ప్రతి ఒక్కటి కూడా చాలా సంప్రదాయపదంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే మనిషి చనిపోయిన తర్వాత కూడా తన దహన సంస్కారాలు కూడా సాంప్రదాయపద్ధంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే మనిషి మరణించినప్పుడు సంధ్యా సమయంలో దహన సంస్కారాలు చేయకూడదని అలాగే రాత్రి సమయంలో ఒంటరిగా శవాన్ని ఉంచకూడదని పెద్దలు చెబుతుంటారు.
ఇలా చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు సంధ్య సమయం లోను రాత్రి సమయంలో ఒంటరిగా ఉంచకూడదు అని ఎందుకు చెబుతారనే విషయాలు చాలా మందికి తెలియదు. సంధ్యా సమయంలో స్వర్గానికి దారులు మోసివేయబడి ఉంటాయి. అలాంటి సమయంలో మనం దహన సంస్కారాలు చేయడం వల్ల చనిపోయిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలగదని పండితులు చెబుతుంటారు అందుకే సంధ్యా సమయంలో ఎప్పుడు కూడా దహన సంస్కారాలు చేయకూడదు రాత్రి సమయంలో శవాన్ని ఎందుకు ఒంటరిగా ఉంచకూడదు అనే విషయానికి వస్తే…
Dead Body:
రాత్రిపూట దుష్టశక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం శవాన్ని ఒంటరిగా ఉంచడం వల్ల దుష్టశక్తులు ఆ శవంలోకి ఆవహించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సృష్టించడానికి కారణమవుతుంది. అదేవిధంగా చనిపోయిన వారి ఆత్మ ఎప్పుడు కూడా అక్కడే తిరుగుతూ ఉంటుందట ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు తమ శరీరంలోకి వెళ్లాలని భావిస్తుంది కానీ అక్కడే కూర్చొని ఉన్నటువంటి వారిని చూసి బాధపడుతూ ఉండటంవల్ల తిరిగి తమ శరీరంలోకి వెళ్లకుండా ఉంటుందని చెబుతారు. అందుకే చనిపోయిన వారి వద్ద కొంతమంది అయినా తెల్లవార్లు మేలుకొని ఉండాలని పెద్దలు చెబుతుంటారు.