Wed. Jan 21st, 2026

    Dasara : ఎట్టకేలకు మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇంతకాలానికి కీర్తి సురేష్ ఖాతాలో ఓ కమర్షియల్ హిట్ పడింది. మహానటి సక్సెస్‌తో వరుసగా సినిమాలు ఒప్పుకుంది. వాటిలో చాలా సినిమాలు భారీ హిట్ సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకొని అందరికీ షాకిచ్చింది. కానీ, ఆ సినిమాలే భారీ డిజాస్టర్ అయి రివర్స్‌లో కీర్తికి షాకిచ్చాయి.

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అణ్ణాత్త కూడా హిట్ అనుకున్నారు. కానీ, ఆ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఇక నితిన్‌తో చేసిన రంగ్ దే, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట కొంతవరకూ కీర్తిని కాపాడాయి. కానీ, పూర్తిగా ఒడ్డుకు మాత్రం చేర్చలేకపోయాయి. ఇప్పుడు నాని ఆ పని చేశాడు. దసరా సినిమాలో హీరోయిన్‌గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వద్దన్నా కూడా నాని నమ్మి తీసుకున్నాడు.

    dasara-keerthy suresh got success because of nani
    dasara-keerthy suresh got success because of nani

    Dasara : బ్రేకీవెన్ కి దగ్గర్లో ఉంది.

    అంతేకాదు, దసరా రిలీజ్ అయ్యాక మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్‌లో ఇటీవల వచ్చిన అన్నీ సినిమాలను బ్రేక్ చేసింది. నెమ్మదిగా దసరా సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకీ ఎక్కుతోంది. బ్రేకీవెన్ కి దగ్గర్లో ఉంది. దాంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్‌లో ఉన్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ చాలా ఆనందంగా ఉంది.

    చాలాకాలం తర్వాత కీర్తి ఊహించని సక్సెస్ దక్కింది. అది కూడా నాని వల్లే. మొత్తానికి ఈ బ్యూటీని నాని లాక్కొచ్చి ఒడ్డున పడేశాడు. లేదంటే ఇప్పట్లో కీర్తి సురేష్‌కి హీరోయిన్‌గా అవకాశాలు వచ్చేవి కాదేమో. ఏదేమైనా దసరా కీర్తికి మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ప్రస్తుతం అమ్మడు ఇదే ఊపులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీలకమైన పాత్రను చేస్తోంది. ఇది కూడా హిట్ అందుకుంటే ఇక కీర్తికి అవకాశాలు క్యూ కడతాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.