Beauty Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా అందాన్ని పెంపొందించుకోవడం కోసం ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే చాలామంది కేవలం ఫేస్ పై మాత్రమే ఫోకస్ చేస్తారు కానీ మెడ భాగాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఈ క్రమంలోనే మొహం తెల్లగా ఉన్న మెడ భాగం మొత్తం నల్లగా ఉండి అంద విహీనంగా ఉంటుంది.
ఈ విధంగా మెడ చుట్టూ నల్లగా ఉన్నట్లయితే ఎలాంటి క్రీములు వాడిన ప్రయోజనాలు లేకపోతే సహజ పద్ధతిలోనే ఈ చిట్కాలను ఉపయోగిస్తూ మెడ చుట్టూ ఉన్న నలుపు రంగును తొలగించి అందంగా మారవచ్చు మరి ఏ చిట్కాలను ఉపయోగించాలి ఏంటి అనే విషయానికి వస్తే..శనగపిండి మంచి స్క్రబ్బర్ లా పని చేస్తుంది. శనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి చర్మాన్ని కూడా శుభ్రపరుస్తుంది.
ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ టీ స్పూన్ల సెనగపిండి తీసుకోవాలి అందులోకి చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టి అనంతరం చుట్టూ పూసి స్క్రబ్ చేయాలి. అనంతరం నీటితో కడగాలి ఇలా వారం రోజులు పాటు చేయడం వల్ల నలుపు రంగు తొలగిపోతుంది.పచ్చిపాలను దూది సహాయంతో మెడ చుట్టూ అప్లై చేసి స్మూత్ గా మర్దనా చేయాలి. 20 నిమిషాల తర్వాత మెత్తని గుడ్డతో శుభ్రం చేయాలి.ఆలివ్ ఆయిల్ లో కొంచెం పంచదార కలిపి మెడ చుట్టూ మసాజ్ చేయాలి.. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఈ చిట్కాల వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.