Tue. Jan 20th, 2026

    Chiranjeevi : ఓటీటీ ప్లాట్ ఫాంస్ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటుగా సెలబ్రిటీ టాక్ షోస్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ సీజన్స్ ఎంత పాపులర్ అయ్యాయో అల్లు అరవింద్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్స్ కూడా అంతే పాపులర్ అయ్యాయి. అసలు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే పెద్దగా ఆసక్తి చూపించని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్‌కి వచ్చి అలరించడం పెద్ద హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

    cWho threw eggs at Chiranjeevi..? Will it be revealed then?
    cWho threw eggs at Chiranjeevi..? Will it be revealed then?

    ఒకవైపు బాలయ్య ఇంకో వైపు పవన్ కళ్యాణ్ ఉంటే ఎంత రసవత్తరంగా షో ఉంటుందో ఈ అన్‌స్టాపబుల్ షో సీజన్ 2తో తెలిసింది. ఇప్పుడు అలాంటి మరో సెలబ్రిటీ టాక్ షో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రముఖ పాప్ సింగర్ స్మిత సోనీ లివ్ కోసం హోస్ట్‌గా ఈ టాక్ షో చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, సాయి పల్లవి లాంటి స్టార్స్‌తో షూటింగ్ కంప్లీట్ చేశారు.

    Chiranjeevi : చిరంజీవిని స్మిత చాలా ఠఫ్ క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తోంది.

    వీరందరూ ఉన్న ప్రోమో కూడా ఇప్పటికే రిలీజై అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తాజాగా నిజం విత్ స్మిత కార్యక్రామానికి సంబంధించి చిరంజీవి గెస్ట్‌గా వచ్చిన ప్రోమో రిలీజై నెట్టింట సందడి చేస్తోంది. ఈ ప్రోమో చూస్తే చిరంజీవిని స్మిత చాలా ఠఫ్ క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తోంది. మీ ‘కాలేజీ డేస్ లో మీ ఫస్ట్ క్రష్ ఎవరూ..? స్టార్ డమ్ అనేది కొంత మందికే..ఒక స్టేజ్ కి వెళ్లాలంటే అవమానాలు..అంటూ ప్రశ్నించింది.

    ఈ ప్రశ్నకి చిరంజీవి ‘జగిత్యాలలో పై నుంచి పూల వర్షం కురుస్తోంది. ఇంకాస్త ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు తీసుకుని కొట్టారు’..అంటూ ఊహించని సమాధానం చెప్పారు. అయితే, ఇది ఏ సందర్భంగా జరిగిందో మాత్రం రివీల్ చేయలేదు. కానీ, ఈ కోడిగుడ్డు విసిన మాట వింటే మెగాస్టార్ నటించిన మాస్టర్ సినిమా గుర్తొస్తుందంటున్నారు. అందులో ఓ సీన్ ఉంటుంది. ఈ సీన్‌లో లెక్చర్‌గా ఉన్న చిరుపై కొందరు స్టూడెంట్స్ కోడిగుడ్లు. టొమాటోలు..రక రకాల కూరగాయలు విసురుతారు. బహుషా మాస్టర్ సక్సెస్ టూర్‌కి వెళ్ళినప్పుడు జగిత్యాలలో ఈ సన్నివేశం చోటు చేసుకుందేమో అని అనిపిస్తోంది. చూడాలి మరి ఈ నెల 10వ తేదీన నిజం విత్ స్మిత టాక్ షోలో మెగాస్టార్ ఎపిసోడ్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.