Health Tips: ప్రతిరోజు భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తినడం మనందరికీ అలవాటే. కొందరు పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. మరికొందరు మజ్జిగ తినడమే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు కానీ అసలు విషయానికొస్తే నిజానికి పాలను తోడబెట్టి పెరుగుగా మారుస్తారు పెరుగును చిలికితే మజ్జిగ తయారవుతుంది. కనుక పాలల్లో ఉండే పోషక పదార్థాలు అన్నీ పెరుగు ,మజ్జిగలో కూడా ఉంటాయి. కావున పెరుగు మజ్జిగ రెండు మన ఆరోగ్యానికి మంచివే. అయితే మనం పెరుగు తినాలా మజ్జిగ తినాలా అన్న విషయాన్ని మన ఆరోగ్య పరిస్థితుల దృశ్య మనమే నిర్ణయించుకోవాలి.
ఇకపోతే కొందరు కొన్ని రకాల సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు కొన్ని సందర్భాలలో పెరుగు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతుంటారు .చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు పెరుగు తినకపోవడమే మంచిది. పెరుగు గట్టిగా ఉండటం వల్ల అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. అయితే ఇవి జీర్ణం కావడానికి కాస్త ఆలస్యం అవుతుంది అందుకే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు రాత్రి పడుకునే సమయంలో ముఖ్యంగా పెరుగు తినకపోవడం చాలా మంచిది.
ఎవరైతే అధిక శరీర బరువుతో బాధపడుతుంటారు అలాంటి వారు పెరుగు కాకుండా మజ్జిగ తాగడం మంచిది. మజ్జిగలో ఉండే కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నమై ఉండి త్వరగా జీర్ణం అవుతాయి కాబట్టి ఎలాంటి సమస్య తలెత్తదు.అదే పోషకాహార లోపం, తక్కువ శరీర బరువు కలిగిన వారు పెరుగును ఆహారంగా తీసుకోవాలి ఎందుకంటే మజ్జిగలో ప్రోటీన్స్, కొవ్వు పదార్థం విచ్ఛిన్నమై ఉండడంవల్ల ఆశక్తి వీరికి సరిపోదు.రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా అవసరం. ఇక తరచూ పెరుగు మజ్జిగను తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మనకు ఏ విధమైనటువంటి రోగాలు రాకుండా కాపాడటమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.