Curd: చలికాలం రావడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతాయి. ఇలా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల చాలామంది జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు గురి అవుతూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడినవారు చాలా కాలం పాటు ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు అందుకే చాలామంది చలికాలం వచ్చింది అంటే పెరుగు తినడానికి పెద్దగా ఇష్టపడరు. తెలుగులో మానేయడం వల్ల జలుబు వంటి సమస్యలు దరి చేరవు అని భావిస్తూ ఉంటారు ఇలా చలికాలంలో జలుబు చేస్తుందని పెరుగు కనుక మానేస్తున్నట్లయితే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో మన ఆరోగ్యాన్ని పెంపొందింప చేసే ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. అందుకే చలికాలంలో పెరుగును తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ప్రో బయోటిక్స్ మన జీర్ణ వ్యవస్థలో రోగనిరోధక శక్తిని పెంపొందించే కణాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ విధంగా కణాలు అభివృద్ధి చెందటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది.
ఇకపోతే చలికాలంలో సూర్యుడు పెద్దగా కనిపించరు కనుక మనకు సూర్యం రశ్మి నుంచి వెలువడే విటమిన్ డి కూడా తక్కువగా అందుతుంది. అందుకే పెరుగును తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి విటమిన్ డి మన శరీరానికి లభిస్తుంది. ఇలా పెరుగు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే చాలామంది జలుబు సమస్యతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకపోయినా మధ్యాహ్నం అయినా తప్పనిసరిగా ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవాలి.