Corona Virus: కరోనా పేరు వింటేనే చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ చేసినటువంటి నష్టం ఎలాంటిదో ఇప్పటికే మర్చిపోలేదు. కంటికి కనిపించిన టువంటి ఈ మహమ్మారి మనుషుల ప్రాణాలను బలి చేస్తూ వచ్చింది. పిట్టలు రాలిపోయినట్టు జనాలు గుట్టలు గుట్టలుగా చనిపోవడం ఎంతో హృదయ విదారక ఘటన అని చెప్పాలి. ఇక ఈ మహమ్మారి నుంచి బయటపడ్డాము అని ఊపిరి పీల్చుకొని లేపు ఈ వైరస్ కొత్త రూపం దాల్చుకొని మరోసారి తన పంజా విసురుతుంది.
కొత్త రూపం దాల్చుకున్నటువంటి ఈ కరోనా వైరస్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చాప కింద నీరు లాగా పాగిపోతుంది అంతేకాకుండా ప్రస్తుతం పండుగలు కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఒకే చోట చేరి పండుగలను సెలెబ్రేట్ చేసుకుంటున్నటువంటి తరుణంలో ఈ మహమ్మారి సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.. రోజురోజుకు కరోనా కేసులు కూడా అధికమవుతున్నాయి. మరి కొత్తగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఏంటి ఇది వస్తే ప్రమాదకరమా దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే..
కొత్తగా రూపం దాల్చుకున్నటువంటి ఈ కరోనా వేరియెంట్ ఇదివరకు కరోనా వచ్చిన వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే మనం ఇంజక్షన్ వేయించుకున్నప్పటికీ కూడా ఈ కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్ పెద్దగా ప్రమాదకరం కాదని చెబుతున్నారు వారం రోజులకు పైగా జ్వరం తలనొప్పి చలి దగ్గు శ్వాస ఆడక పోవడం వాసన రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని ఇవి కరోనా వేరియంట్ లక్షణాలేనని నిపుణులు చెబుతున్నారు.