Health Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అధిక బరువు సమస్యతో పాటు జీర్ణక్రియ సమస్యలను కూడా ఎదుర్కొంటు ఉన్నారు. ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అద్భుత ఔషధంగా నిమ్మరసం కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అధిక పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవడం లేదు దీంతో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కావడం శరీరంలో టాక్సీన్ లు ఏర్పడటం రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ద్వారా ఎన్నో రకాల రోగాలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి.
ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు నిమ్మరసం కొత్తిమీర అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని చెప్పాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ జ్యూస్ తాగటం వల్ల ఈ రోగాలు అన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టవచ్చు ముందుగా ఒకరోజు రాత్రి కొత్తిమీర ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండి రాత్రంతా అలాగే పెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ జ్యూస్ తాగటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు మనకు దరి చేరవని చెప్పాలి.
ఇలా కాకుండా ఉదయం పరిగడుపున ఒక గ్లాస్ నీటిని ఐదు నిమిషాల పాటు వేడి చేసి అందులోకి కొత్తిమీర ఆకులను వేసి కాస్త మరగనివ్వాలి అనంతరం గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ నీటిలోకి టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని పరగడుపున తాగటం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది ఇక విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. మన శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా కాపాడుతుంది. అయితే ఈ నిమ్మరసం 15 రోజులపాటు రోజు విడిచి రోజు తాగాలి అలాగే వారం గ్యాప్ ఇచ్చి తిరిగి 15 రోజులు రోజు విడిచి రోజు తాగటం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.