Wed. Jan 21st, 2026

    News: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని వండేవారు. దీనికోసం ఎండిపోయిన కలపను ఉపయోగించి ఆరు బయట పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేసేవారు. ఉమ్మడి కుటుంబాలు అయినా కూడా ఇంట్లో అందరికీ ఆ కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు దైనందిన జీవితంలో ప్రజల జీవన స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు చాలా తగ్గిపోయారని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలలో కూడా 10 నుంచి 20 శాతం మంది మాత్రమే కట్టెల పోయ్యిని వంట చేయడం కోసం ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు.

    మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్ ని వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సిటీలలో అయితే పూర్తిగా గ్యాస్ మీదనే వంటల కోసం ఆధారపడతారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్లో ఉండే వాయువులు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఇంటర్నల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో 13 శాతం మంది చిన్నారులు గ్యాస్ స్టవ్ ఉధ్గారాల కారణంగా ఆస్తమా బారిన పడుతున్నారు. గ్యాస్ స్టవ్ మండుతున్న సమయంలో వెలువడే వాయువులు పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    cooking-gas-is-not-safeగ్యాస్ స్టవ్ ను వినియోగించే సమయంలో ఆ ఉద్ద్గారాలలో విషవాయువులు విడుదలవుతాయి. ఆ సమయంలో వంట గదిలో ఉండి ఆ వాయువులను పీల్చినట్లయితే కచ్చితంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వంట గదిలో వంట గ్యాస్ ఆన్ చేసి వంట చేసే సమయంలో కచ్చితంగా ఆ విషవాయువులు బయటికి పోయే విధంగా వెంటిలేషన్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. వంటగ్యాస్ నుంచి విడుదలైన వాయువులు ఇంట్లోనే ఉంటే పిల్లలపై ముఖ్యంగా దుష్పరిణామాలు చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.