Red Banana: కాలాలకు అనుకూలంగా మనకు లభించే పండ్లలో అరటిపండు ఈ అరటిపండు ఏ సీజన్లో అయినా మనకు దొరుకుతాయి. అంతేకాకుండా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఏ శుభకార్యానికి వెళ్లిన ఏ పూజా కార్యక్రమాలలో అయినా కూడా అరటిపండు కీలక ప్రాధాన్యత సంతరించుకుని ఉంది. అయితే మనం ఇప్పటివరకు పసుపు రంగులో ఉండే అరటి పండ్లను చూసాము కానీ ఎప్పుడూ కూడా ఎరుపు రంగులో ఉండే అరటి పండ్లను చూసి ఉండము. అయితే ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.
ఇలా అరుదుగా ఎర్రని అరటి పండ్లు కనుక కనిపిస్తే అసలు వదలకండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే పసుపు రంగు అరటిపండుతో పోలిస్తే ఎరుపు రంగు అరటిపండులో అధిక పోషక విలువలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఎర్రని అరటిపండు తినడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. ఎర్రని అరటి పండు తినడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. ఇక రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఎర్రటి అరటి పండు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
ఎర్రటి అరటి పండులో ఐరన్ పుష్కలంగా లభిస్తున్న తరుణంలో రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఎంతో మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. మన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అదే విధంగా నరాలను కూడా బలపరుస్తుంది. అరటి పండులో ఉండే కొన్ని రకాల గుణాలు.. క్యాన్సర్లతో పోరాడేందుకు సహాయ పడతాయి. సంతాన లేమి సమస్యలను కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. ఇలా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ అరటిపండు ఎక్కడైనా కనిపిస్తే తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.