Wed. Jan 21st, 2026

    Congress Vs BJP: దేశ రాజకీయాలలో ప్రస్తుతం కాంగ్రెస్ బిజెపి మధ్య ఆసక్తికరమైన వైరం నడుస్తుంది. దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని సమూలంగా క్లోజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. బలమైన నాయకత్వం లేకపోవడంతో బిజెపి పార్టీని ప్రధాని నరేంద్ర మోడీని బలంగా ఎదుర్కోలేకపోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వ ప్రతిభ పై ప్రజలలో ఇంకా బలమైన నమ్మకం ఏర్పడలేదు. భారత్ జూడో యాత్ర ద్వారా పాదయాత్ర చేసిన కూడా దాంతో పూర్తిస్థాయిలో ప్రజలను ఆకర్షించలేదనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా నాలుగేళ్ల క్రితం మోడీ ఇంటి పేరుతో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై ఒక వ్యాపారి కేసు పెట్టారు.

    Your father's life ended as Bhrashtachari No 1: PM Modi to Rahul Gandhi -  India Today

    అయితే ఈ కేసులో రాహుల్ గాంధీ దోషిగా కోర్టు తేల్చేసింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల శిక్ష కూడా ఖరారు చేసింది. దీంతో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రాహుల్ గాంధీ ఎంపీ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేసింది. అది అమలు చేస్తే ఆరేళ్లపాటు రాహుల్ గాంధీ పోటీ చేసే అర్హతలు కూడా కోల్పోతారు. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అయితే దీనిపై కాంగ్రెస్ తో పాటు బిజెపిని వ్యతిరేకించే విపక్షాలు కూడా ఏకమై తీవ్రంగా ఖండించాయి. బిజెపి నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తూ విపక్షాలను అణచివేయాలని కుట్రలు చేస్తున్నాయని రాజకీయ నాయకులు అంటున్నారు. చేసిన నేరానికి శిక్ష పడుతుంది అని బిజెపి నేతలు చెప్తున్నారు.

    Cong, BJP start taking preparations a year in advance for Chhattisgarh  assembly elections - India Today

    అయితే రాహుల్ గాంధీ సైతం మోడీ ఇంటి పేరుపై తాను చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోనని అలాగే సారీ చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ తనికి ఉందని, ఇక ఈ విషయంలో కచ్చితంగా తన పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలతో తమ ప్రభావం ఏంటి అనేది చూపించాలని భావిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా బిజెపి మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. ఇదిలా ఉంటే తాజాగా అనారాత వేటుపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇక రాహుల్ గాంధీపై అనార్హత వేటు వేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నాడని సాంకేతాలు ప్రజలకు పంపించారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. బిజెపి అతిపెద్ద సెల్ఫ్ గోల్ చేస్తుందని, దీని పర్యవసానం 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని శశి థరూర్ లాంటి నాయకులు విమర్శలు చేస్తున్నారు.