Coconut Water: వేసవి కాలం వచ్చిందంటే మనకు ఎక్కడ చూసినా కొబ్బరి బొండాలే కనపడుతుంటాయి .వేసవిలో కొబ్బరి బోండాలు అధికంగా తీసుకోవడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడవచ్చు అని చాలామంది భావిస్తారు. ఇలా కొబ్బరి నీళ్లను తాగితే దాహం మాత్రమే తీరుతుంది అని అనుకుంటున్నారు. అది పొరపాటు ఆలోచన కొబ్బరి నీళ్లను తాగితే దాహం తీరడంతో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్స్ ,మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ను అందించడంతోపాటు ఈ వేసవికాలంలో శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షించి ఎల్లప్పుడూ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న వేసవి సీజన్లు శరీరం తొందరగా అలసిపోయి నీరసం,ఒత్తిడి, చికాకు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లను సేవిస్తే ఇందులో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే కాల్షియం వంటి మినరల్స్ నిత్య జీవక్రియలకు అవసరమైన శక్తిని అందించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ తక్షణ శక్తిని అందించి డిహైడ్రేషన్ సమస్య వల్ల మందగించిన అవయవాల పనితీరును క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.
Coconut Water:
చిన్నపిల్లలతో ప్రతిరోజు గ్లాసుడు కొబ్బరి నీళ్లను తాగిస్తే శరీర అవసరాలకు సరిపడా గ్లూకోస్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభించి తొందరగా అలసిపోనివ్వదు. అతి బరువు సమస్యతో బాధపడేవారు తరచు తక్కువ కొవ్వులు ఉండే కొబ్బరినీళ్లను రోజూ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. గర్భిణీ మహిళలు కొబ్బరి నీళ్లను తరుచు తాగటం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. అక్క పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కొబ్బరి నీళ్ళను అధికంగా తాగటం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.