Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవప్రసాద్‌గారు సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్‌ను నమోదు చేస్తోంది. దీంతో, చిత్రబృందం గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను జరిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక, ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ సహా ఇతర నటీమణులు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్‌పై చిరు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అందం లాంటిది అన్నారు. ఎవరు ఎలా ఉంటారో వారు కెరీర్ కూడా అలా సాగుతుందని, సినిమా ఇండస్ట్రీ ఓ అద్భుతమైన ప్రపంచం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు..కానీ, ఇక్కడ సక్సెస్ అవడం అనేది మనం కష్టపడటం మీదే ఆధాపడి ఉంటుంది..ఇక్కడ మన ప్రవర్తన బట్టే ఫలితం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.

chiranjeevi-comments-viral-on-casting-couch-at-msg-event

Chiranjeevi: చిరు తనయ..నిర్మాత సుష్మిత గురించి మాట్లాడుతూ,

సుష్మిత గురించి కొన్ని విషయాలు:

చిరు తనయ..నిర్మాత సుష్మిత గురించి మాట్లాడుతూ, తను అనుకుంటే పెద్ద స్టార్స్‌తోనే సినిమాలు చేయొచ్చు. కానీ, ముందు అనుభవం రావాలి..ఇండస్ట్రీలో అన్నీ విభాగాల మీద పట్టు సాధించాలి. అందుకే, కొన్ని వెబ్ సిరీస్ చేసింది. అలా, ఇక్కడ ఉన్న లోటుపాట్లు తెలుసుకున్న తర్వాతే నాతో సినిమా నిర్మించింది. ఇప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇండస్ట్రీ చాలా గొప్పది..మనం కష్టపడితేనే సక్సెస్ వస్తుంది..అలా, కాకుండా మామీద నెగిటివిటీ ఉందని భావిస్తే..అది వారి తప్పే అవుతుందని చిరు మాట్లాడారు.

ఇక్కడ ఎవరైనా సరే..వారి బిహేవియర్ మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రతీ విషయంలో ఎంత నిబద్ధతతో ఉంటే అంతగా విజయం నున్ను వరిస్తుంది. ఏ ఒక్కరూ అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను ఇబ్బంది పెట్టరు..కాస్టింగ్ కౌచ్ లాంటివి కూడా ఉండవు. ఇండస్ట్రీలో ఇలాగే ఉండాలేమో అనుకుంటే అవతలి వాళ్ళకి అది అవకాశం అవుతుంది. నువ్వు ఎంత ప్రొఫషనల్‌గా ఉంటే అవతలి వాళ్ళు కూడా అంతే ప్రొఫషనల్‌గా ఉంటారు..అంటూ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై చిరు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి, మెగాస్టార్ చిరంజీవి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ హిట్ అందుకున్నారు. నయనతార హీరోయిన్‌గా వెంకటేష్ గెస్ట్ రోల్ చేసిన మన శంకరవరప్రసాద్‌గారు అందరికీ ఓ మైల్ స్టోన్ మూవీగా మిగులుతుందనడంలో సందేహమే లేదు. దర్శకుడిగా అనిల్ రావిపూడి 9 వ హిట్ అందుకోవడం విశేషం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 day ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 day ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 day ago

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

3 days ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

5 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

6 days ago

This website uses cookies.