Wed. Jan 21st, 2026

    Health: చలికాలం చంపేస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం 5 దాటంగానే వణుకు పుడుతోంది. ఈ సమయం లో ఏం తిందామన్నా హాట్ గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది . ఓ సూప్ వేస్తే ప్రాణం రిలాక్స్ అవుతుందని అందరి భావన అందుకోసమే కూరగాయలతో పాటు చికెన్ తో చేసే రుచికరమైన సూప్ రెసిపీని మీకు అందిస్తున్నాము. ఈ కూల్ కూల్ వింటర్ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఈ సూప్ రెసిపీ సరైనదిగా ఉంటుంది.

    వెజ్ సూప్ అంటే పిల్లలు తినరు, నాన్ వెజ్ ఆడ్ చేస్తే ఎవ్వరైనా ఇట్టే తాగడానికి ఇష్టపడతారు. మరి ఈ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
    పదార్థాలు :

    chicken vegetable soup
    చికెన్ : ఒక కప్పు
    తురిమిన క్యారెట్ : మీడియం కప్పు
    బీన్స్ : 1 /2 కప్పు
    కార్న్ : 1 /2 కప్పు
    ఉప్పు : తగినంత
    ఒరిగానో : తగినంత
    బ్లాక్ పెప్పర్ : తగినంత
    కొత్తిమీర : గార్నిష్ కు సరిపడినంత

    తయారీ విధానం :
    చికెన్‌ను కొద్దిగా ఉప్పు వేసి టెండర్ నెస్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడకబెట్టిన పులుసును ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకొని అందులో బాయిల్ చేసిన పులుసును , కూరగాయలను కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి , ఒరిగానో వేసుకోవాలి. కూరగాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు బాయిల్ చేసి కట్ చేసిన చికెన్ పీసెస్ ను ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసి హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.