Chandrayaan-3 : అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం హిస్టరీని క్రియేట్ చేసింది. రోదసిలో ఇప్పటివరకూ ఏ దేశం సాధించలేకపోయిన టార్గెట్ ను ఇస్రో సక్సెస్ ఫుల్ గా సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపింది.
చంద్రుడి చెంతకు చేరిన ప్రజ్ఞాస్ రోవర్ తన పనిని మొదలు పెట్టింది. చందమామ గుట్టు విప్పేందుకు శివశక్తి పాయింట్‌లో చక చకా తిరుగుతుంది. చందమామ రహస్యాలను బయట పెట్టేందుకు తన ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఏం చేస్తోంది? ఎలాంటి పరిశోధనలు జరుపుతోంది? వంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. చందమామ రహస్యాలను త్వరగా తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో అధికమవుతుంది. అందుకు తగ్గట్లుగానే ప్రజ్ఞాన్ తన పని తాను చేసుకోపోతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ను ISRO శాస్త్రవేత్తలకు అందిస్తోంది.
జాబిల్లి ఉపరితలం పై సంచరిస్తున్న ప్రజ్ఞాన్ అక్కడ చిన్న చిన్న గుంతలను తవ్వుతుంది. పది మీటర్ల లోతు వరకు డ్రిల్ చేసి ఉపరితలం కింద ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రుడి ఉపరితలం కింద మట్టి ఉందా?నీళ్లు ఉన్నాయా? రాళ్లలో ఉన్నాయా? లోపల మెత్తగా ఉందా గట్టిగా ఉందా? జాబిల్లి ఉపరితలం కింద అసలు ఏముంది అని తెలుసుకునేందుకు తన పరిశోధనలు చేస్తోంది.
ఇస్రో శాస్త్రవేత్తలు అందిస్తున్న కమాండ్స్ ను అనుసరిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతోంది ప్రజ్ఞాన్ రోవర్. జాబిల్లి దక్షిణ ధృవం పై అడుగు పెట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడి పని చేస్తోంది ప్రజ్ఞాన్ రోవర్. జాబిల్లిపై పరిశోధనలు చేయడమే కాదు ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్రోకు చేరవేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా చందమామపై ఉష్ణోగ్రతల ను పరిశీలించింది ఈ రోవర్. చందమామ పై ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? ఎన్ని డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి వంటి వివరాలను తెలుసుకునేందుకుగాను ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ లో చంద్రాన్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్ ను అమర్చింది.ఇదే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను కొలిచినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రజ్ఞాన్ రోవర్ అందించిన సమాచారం వరకు చందమామపై మైనస్ 10 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుతున్నట్లు తెలుస్తోంది. ఉపరితలం పైనే కాదు చంద్రాన్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్ చందమామ ఉపరితలం లోపలా పరిశోధనలు చేసే సామర్థ్యం కలదు. ఇది 10 మీటర్ల లోతు వరకు వెళ్లి అక్కడి పరిస్థితులను అంచనా వేయగలదు. ఇందులో అమర్చిన సెన్సార్లు చంద్రుడి ఉపరితలం లోపల ఎలాంటి నిక్షేపాలు ఉన్నాయి. సహజ నిధులు ఏమైనా ఉన్నాయా ఇలా అక్కడి మాట్టి, నీళ్లపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.