Chandramukhi 2 : కంగనా ఫ్యాన్స్ కు షాక్..చంద్రముఖి 2 విడుదల వాయిదా

Chandramukhi 2 : సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో సంచనల విజయాన్ని సంధించిందో అందరికి తెలుసు. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్ల తర్వాత డైరెక్టర్ పి. వాసు సీక్వెల్ తీస్తున్నారు. ఈ సీక్వెల్ లో ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్ నటుడు రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈసారి చంద్రముఖి గా బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ కనిపించబోతోంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో సుభాస్కరన్‌ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని , పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే మూవీ టీం చంద్రముఖి2 ని వినాయక చవితి నాటికీ విడుదల చేయాలనీ భావించిందని ముందుగా ప్రచారం జరిగింది.

chandramukhi-2-movie-release-date-postponed

అయితే, తాజాగా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యింది . సెప్టెంబర్ 28న చంద్రముఖి2ని విడుదల చేయాలని తాజాగా మూవీ టీం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఈ హార్రర్-కామెడీ మూవీ సెప్టెంబర్ నెలాఖరులో థియేటర్ లో విడుదల కానుంది.

 

తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ చంద్రముఖి2ను రిలీజ్ చేస్తున్నారు. అయితే విడుదల వాయిదాకు కారణాలు ఏంటనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్యనే విడుదల అయ్యింది. చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్ కు మరిన్ని హంగులను అద్దుతోందని సమాచారం. అందుకే ఆలస్యం అవుతోందని టాక్. ఈ మూవీలో కంగన, లారెన్స్ తో పాటు తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ మూవీలో కీ రోల్ లో కనిపించునున్నారు.ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.

2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో తలైవ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ మూవీలో చంద్రముఖిగా జ్యోతిక ఇరగదీసింది. ప్రేక్షకులు ఆమె నటనకు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ కు 100 శాతం న్యాయం చేసింది జ్యోతిక. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పట్లో ఈ మూవీని రూ. 9 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేశారు సెకండ్ పార్ట్ కు అంతకు మించి పెట్టుబడి పెట్టారు.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.