Chandramukhi 2 : సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో సంచనల విజయాన్ని సంధించిందో అందరికి తెలుసు. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్ల తర్వాత డైరెక్టర్ పి. వాసు సీక్వెల్ తీస్తున్నారు. ఈ సీక్వెల్ లో ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్ నటుడు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఈసారి చంద్రముఖి గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కనిపించబోతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని , పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే మూవీ టీం చంద్రముఖి2 ని వినాయక చవితి నాటికీ విడుదల చేయాలనీ భావించిందని ముందుగా ప్రచారం జరిగింది.
అయితే, తాజాగా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యింది . సెప్టెంబర్ 28న చంద్రముఖి2ని విడుదల చేయాలని తాజాగా మూవీ టీం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఈ హార్రర్-కామెడీ మూవీ సెప్టెంబర్ నెలాఖరులో థియేటర్ లో విడుదల కానుంది.
తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ చంద్రముఖి2ను రిలీజ్ చేస్తున్నారు. అయితే విడుదల వాయిదాకు కారణాలు ఏంటనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్యనే విడుదల అయ్యింది. చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్ కు మరిన్ని హంగులను అద్దుతోందని సమాచారం. అందుకే ఆలస్యం అవుతోందని టాక్. ఈ మూవీలో కంగన, లారెన్స్ తో పాటు తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ మూవీలో కీ రోల్ లో కనిపించునున్నారు.ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.
2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో తలైవ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ మూవీలో చంద్రముఖిగా జ్యోతిక ఇరగదీసింది. ప్రేక్షకులు ఆమె నటనకు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ కు 100 శాతం న్యాయం చేసింది జ్యోతిక. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పట్లో ఈ మూవీని రూ. 9 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేశారు సెకండ్ పార్ట్ కు అంతకు మించి పెట్టుబడి పెట్టారు.