Thu. Jan 22nd, 2026

    Chandrababu: ఏపీ రాజకీయాలలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ తన అధికార బలం ఉపయోగించుకొని ప్రతిపక్షాలని అణచివేయడంతో పాటు వాలంటీర్లని ఉపయోగించుకొని సంక్షేమ పథకాలని నమ్ముకొని గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ముందుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సంక్షేమ పథకాల గురించి చెప్పి ఓటుని అడగడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్ని రద్దు చేస్తారు అంటూ ఒక భయాన్ని ప్రజలలో రేకేత్తిస్తారు. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాత్రం వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి చంద్రబాబు రాజనీతిని ఉపయోగిస్తున్నారు. బలమైన వ్యూహాలతో ప్రజలలోకి వెళ్తున్నారు.

    Andhra Pradesh BJP chief Somu Veerraju welcomes Chandrababu Naidu's meeting  with Pawan Kalyan - The Hindu

    అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ వాటి ద్వారా వ్యతిరేక ఓటు అంతా తమకి అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చిన గెలుపు ఉత్సాహంతో మరింత బలంగా పనిచేసే విధంగా క్యాడర్ ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్రతో ప్రజాభిమానం సొంతం చేసుకుంటున్నారు. అలాగే చంద్రబాబు కూడా జిల్లాల పర్యటనలు చేస్తూ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా విద్వంసం అయ్యింది చూపిస్తున్నారు. విశాఖకి తలమానికం లాంటి రుషికొండని పూర్తిగా నాశనం చేసేశారని పేర్కొన్నారు.

    Chandrababu Naidu urged CM YS Jagan to lead all-party delegation to meet PM  Modi on Krishna Water Dispute

    జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రధాన కాపు ఓటుబ్యాంకు మొత్తం కూడా టీడీపీకి టర్న్ అయ్యేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. ఏపీలో రాజ్యాధికారం కోసం చేస్తున్న కాపు, బలిజ కమ్యూనిటీకి ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప అధికార భాగస్వామ్యం ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయినట్లుగా ప్రచారం నడుస్తుంది. అవసరం అయితే పవన్ కళ్యాణ్ ని హోంమినిస్టర్ బాద్యతలు అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. దీని ద్వారా అత్యున్నతి హోదా ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఆ ఓటుబ్యాంకు టీడీపీకి టర్న్ అవుతుంది.

    Under Chandrababu Naidu, A New Andhra Is In The Works

    ఒక వేళ జనసేన పొత్తు పెట్టుకోకపోతే ఆయా టీడీపీలో ఉన్న కాపు నేతలతో ఆ కమ్యూనిటీ వారితో వ్యూహాత్మకంగా సంప్రదింపులు జరిపి వారిని తనవైపుకి లాక్కునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. అలాగే కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఆ కమ్యూనిటీకి చెందిన వారినే అభ్యర్ధులుగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బలమైన వ్యూహాలతో చంద్రబాబు అధికారం వైపుగా అడుగులు వేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది.