Tue. Jan 20th, 2026

    Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆకస్మిక మృతితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్‌లోని అపోలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 9:45 గంటలకు చనిపోయారు. ఆయన వయసు 82 ఏళ్ళు. అయితే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. చంద్రమోహన్ తో నటించిన చాలామంది హీరోయిన్లు స్టార్డమ్ సంపాదించుకున్నారు. వెండితెరను ఎన్నో ఏళ్ళు ఏలారు. అప్పట్లో చంద్రమోహన్ నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సందర్భంగా ఆయనతో నటించి, తరువాత స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన అప్పటి హీరోయిన్ లు ఎవరో తెలుసుకుందాం.

    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins
    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins

    నటులతో కంపేర్ చేస్తే హీరోయిన్లకు చిత్ర పరిశ్రమలో కాస్త తొందరగానే స్టార్డమ్ వస్తుందని చెప్పొచ్చు. కానీ హీరోలకు మాత్రం అలాకాదు. వారు స్టార్డమ్ సంపాదించాలంటే కొన్నేళ్లు కష్టపడాల్సి వస్తుంది. దివంగత నటులు చంద్రమోహన్ హీరో గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయ్యారు కానీ స్టార్ హీరో కాలేకపోయారు. కానీ ఆయనతో నటించిన హీరోయిన్లకు మాత్రం లైఫ్ ఇచ్చారు. తన చిత్రాల్లో నటించిన దాదాపు హీరోయిన్లు అంతా ఆ తరువాత స్టార్ హీరోయిన్లుగా మారారు ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు అంటే అతిశయోక్తి కాదేమో.

    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins
    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins

    జయప్రద : 1976లో సిరిసిరి మువ్వలు సినిమాలో చంద్రమోహన్ హీరోగా నటించారు.కళాతపస్వికే విశ్వనాధ్ డైరెక్షన్ వహించిన సినిమాలో జయప్రద హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత జయప్రద రేంజ్ మారిపోయింది. ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి.

    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins
    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins

    జయసుధ : ప్రాణం ఖరీదు మూవీ లో చంద్రమోహన్ జయసుధ జోడీగా నటించారు. 1978లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. వీరి జోడి కూడా హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఎన్నో సినిమాల్లో ఈ జోడి రిపీట్ అయింది. ఆ తర్వాత జయసుధ తిరుగులేని నటిగా ఎదిగింది.

    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins
    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins

    శ్రీదేవి : 1978లో వచ్చిన “పదహారేళ్ల వయసు” సినిమా ప్రతి ఒక్కరికి బాగా గుర్తుంటుంది. ఈ సినిమాలో చంద్రమోహన్ కు జోడిగా శ్రీదేవి యాక్ట్ చేసింది . ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత శ్రీదేవికి వరుసగా స్టార్ హీరోల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆమె అతిలోక సుందరిగా గుర్తుండిపోయింది.

    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins
    chandra-mohan-gave-life-to-many-tollywood-star-heroins

    విజయశాంతి : 1983లో విడుదల అయిన “పెళ్లి చూపులు” సినిమాలో చంద్రమోహన్, విజయశాంతి కలిసి నటించారు.. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ “ప్రతిఘటన” ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇక విజయశాంతి వెనక్కి తిరిగి చూసుకోలేదు.