Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు 900కు పైగా సినిమాల్లో నటించిన హిస్టరీ చంద్రమోహన్ సొంతం. తన సహజ సిద్ధమైన నటనతో హావభావాలతో తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లు అలరించారు చంద్రమోహన్. ఆయన సినీ కెరీర్ నుంచి ఇండస్ట్రీలోని వారికకే కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు.
చంద్రమోహన్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. అయినా నటన మీద ఉన్న అభిమానంతో సినిమా రంగం వైపు వచ్చారు. ఆయన భార్య జలంధర బి ఏ ఎకనామిక్స్ చేశారు.ఆమె ఒక ప్రముఖ రచయిత్రి. దాదాపు 100కు పైగా కథలు, నవలలు రాశారు. ఎన్నో సాహితీ పురస్కారాలను ఆమె అందుకున్నారు. ఒకవైపు సినిమాల్లో చంద్రమోహన్ రాణిస్తుంటే, మరోవైపు భార్య జలంధర రచయిత్రిగా మంచి పేరు సంపాదించుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం వరించింది.
చంద్రమోహన్, జలంధరలకు ఇద్దరూ కూతుర్లు. పెద్ద కూతురు మధుర మీనాక్షి, చిన్న కూతురు మాధవి. పిల్లలు ఇద్దరికీ వివాహం జరిగింది. మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో సెటిల్ అయ్యింది. చిన్న కూతురు మాధవి డాక్టర్. ఆమె చెన్నైలోనే ఉంటున్నారు. చంద్రమోహన్ ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్ . అంతేకాదు దివంగత దర్శకులు కళాతపస్వి కే విశ్వనాథ్ కూడా చంద్రమోహన్ కు రిలేటివ్ అవుతారు.
సినిమాల్లోకి రావడానికి మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఎదగడానికి విశ్వనాథ్ గారు ఎంతో సపోర్ట్ చేశారని చంద్రమోహనే ఎన్నో సందర్భాల్లో తెలిపారు. అంతేకాదు వీరిద్దరూ పక్కపక్కనే ఇల్లు కట్టుకుని 25 ఏళ్లు చెన్నైలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాక ఆయన చెన్నైలోనే ఉన్నారు. షూటింగులు ఉంటే మాత్రం హైదరాబాద్ కు వచ్చేవారని సమాచారం.