Pragnency: ఒక మహిళ గర్భధారణ జరిగిన తర్వాత తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో తరచు అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు. ఇలా అనారోగ్యానికి గురి కావడం కడుపులో బిడ్డ ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది తరచూ జ్వరం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో జ్వరం వస్తే ఎలాంటి ప్రమాదం లేదా అన్న విషయాలపై ప్రముఖ గైనకాలజిస్ట్ పలు విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ మాట్లాడుతూ సాధారణంగా ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలలో రోగనిరోధక శక్తి బలహీన పడుతూ ఉంటుంది అందుకే వారు తప్పనిసరిగా ఎంతో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని చెబుతుంటాము. ఇలా రోగనిరోధక శక్తి తక్కువ అయినప్పుడు తరచు వారు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు ఇలా అనారోగ్యానికి గురవుతున్నారు అంటే వారు బలహీనంగా తయారవుతున్నారని చెప్పి సంకేతమే అని తెలియజేశారు.
చాలామంది గర్భధారణ జరిగినటువంటి మహిళలలో జ్వరం రావడం మనం చూస్తుంటాము అయితే ఇలా జ్వరం రావడం వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కానీ ప్రతి నెల ఇలా జ్వరానికి గురి అవుతున్నారు అంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలతోనే చికిత్స తీసుకోవాలని తెలియజేస్తున్నారు . తరచూ జ్వరం సమస్యతో బాధపడుతూ ఉన్నారు అంటే అది బిడ్డ ఎదుగుదలకు బిడ్డ రోగనిరోధక శక్తిపై కూడా ప్రమాదం చూపే అవకాశం ఉంటుంది. కనుక వైద్యులను సంప్రదించి మందులు వాడటం మంచిది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఇలాంటి వ్యాధులకు సొంత వైద్యం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.