Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి హాలీవుడ్ దర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. అలాగే పలు అంతర్జాతీయ మీడియా చానల్స్ కి కూడా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. హాలీవుడ్ లో నటిస్తాడు అనే ప్రచారం కూడా వినిపించింది. ఇక ఆస్కార్ అవార్డుల వేడుకలని ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత రామ్ చరణ్ నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దలని కలిసాడు. హోం మంత్రి అమిత్ షాతో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి భేటీ కావడం విశేషం. అలాగే నేషనల్ న్యూస్ చానల్ ఇండియా టుడేలో రాజ్ దీప్ సర్దేశాయ్ ఏకంగా రామ్ చరణ్ ని ఇంటర్వ్యూ చేయడం కూడా విశేషం.
ఈ స్థాయిలో ఇండియాలో రామ్ చరణ్ కి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. దీనికి కారణం చెర్రి సతీమణి ఉపాసన అనే మాట వినిపిస్తుంది. ఆమెకి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బీజేపీ పార్టీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి చరిష్మా కూడా రామ్ చరణ్ కి ప్లస్ అయ్యింది. దీంతో దేశ వ్యాప్తంగా రామ్ చరణ్ కి ప్రమోషన్ గ్రాండ్ గా లభించింది. అయితే తారక్ కి మాత్రం ఆ స్థాయిలో ప్రమోషన్ లభించలేదు. దీనికి కారణం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కి బలమైన పీఆర్ టీమ్ లేదు.
అలాగే నందమూరి ఫ్యామిలీ అనే బ్రాండ్ ఉన్న కూడా సపోర్ట్ మాత్రం అంతంత మాత్రమే. ఈ బ్రాండ్ అతనికి ఇండియన్ వైడ్ గా ప్రమోషన్ తీసుకురావడంలో ఏ మాత్రం ప్లస్ కాలేదు. అలాగే టీడీపీ పార్టీ కూడా తారక్ కి పెద్ద సపోర్ట్ గా లేదు. ఇవన్నీ కూడా రామ్ చరణ్ కంటే తారక్ కి ప్రమోషన్ తక్కువగా రావడానికి కారణం అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. తారక్ చిన్నప్పటి నుంచి తన స్వశక్తితోనే ఎదిగాడు. ఇప్పుడు కూడా తన సామర్ధ్యంతోనే గ్లోబల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.