Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఆ పార్టీ యువ శక్తి అధ్యక్షుడిగా కొనసాగారు. ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారో అప్పటినుంచి బయటికి వచ్చి స్వాతంత్ర్యంగా ఎదిగే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 2009 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని అనౌన్స్ చేసి తన రాజకీయ ప్రయాణాన్ని మరోసారి మొదలుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా కేవలం బిజెపి, టిడిపి పార్టీలకు మద్దతు ఇచ్చారు.
2014 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో విభేదించి ఒంటరిగా ఎన్నికల బరిలోకి పవన్ కళ్యాణ్ దిగారు. అయితే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన స్టాండ్ మార్చుకొని జగన్ పై విమర్శలు చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లినట్లు అయింది. టిడిపి పార్టీని కాపాడేందుకే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని వైసిపి ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీనిని నమ్మిన ప్రజలు పవన్ కళ్యాణ్ కూడా దారుణంగా ఓడించారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోవడం గమనార్హం.
అయితే 2019 ఎన్నికల తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి జనసేనని వారిపై పోరాటం మొదలుపెట్టారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. వైసిపికి బలమైన ప్రతిపక్షం తామే అని నిరూపించుకునే ప్రయత్నం జరిగింది. అయితే మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మరింత బలంగా ప్రజలకు వెళ్లి టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా తనని ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అలా జరగడం లేదు అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వైసిపి తన పాత ప్లాన్ ని తెరపైకి తీసుకొచ్చి టిడిపి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడని, అందుకే చంద్రబాబు దత్తపుత్రుడుగా మారిపోయి ఆ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్నాడని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ సభలో కూడా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రత్యక్షంగా చెప్పకపోవడం కూడా అందులో భాగమే అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాను ప్రజల తరఫున పోరాటం చేస్తానని, ప్రజలు కోరుకుంటే తనకు అధికారిమిస్తే ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు తప్ప, కచ్చితంగా తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాత్రం బలంగా చెప్పడం లేదు. ఇదే వైసిపికి బలంగా మారింది.
పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి తప్పుడు కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం వైసిపి మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ మాటలకు కాస్త క్రెడిబిలిటీ ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసిపి అదేపనిగా వ్యక్తిగతంగా విమర్శల దాడి చేస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని కించపరచే ప్రయత్నం చేస్తుంది. అయితే వైసిపి చేస్తున్న దాడిని పవన్ కళ్యాణ్ సింపతి ఓటింగ్ గా మార్చుకోకుండా తన అజెండాలోని ముందుకు వెళ్తున్నారు. జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు.
అలాగే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నారు. అయితే జన సైనికుల కోరికను పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా టిడిపితో పొత్తు పెట్టుకుని ఒక 50 స్థానాల్లో పోటీ చేస్తే చాలు అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు అనే మాట రాజకీయాల్లో వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీలతో ప్రత్యర్థులనే కాకుండా జనసైనికులను కూడా కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ వెంట నడవాలనుకునే న్యూట్రల్ వాటర్స్ లో జనసేనని విధానాలపై ఉన్న కన్ఫ్యూజన్ ని అవకాశంగా మార్చుకొని వారి ఆలోచన డైవర్ట్ చేసే ప్రయత్నం అధికార పార్టీ వైసిపి బలంగా చేస్తుంది.
దీనికోసం సోషల్ మీడియాని చాలా విస్తృతంగా ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ పై ఆగకుండా ప్రతిరోజు విమర్శలు దాడి చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వైసిపి వదులుకోవడానికి సిద్ధంగా లేదు. జనసేనని ప్రజల్లోకి వెళ్లి బస్సుయాత్ర చేసిన కూడా ఆయనకి ఎలాంటి ప్రయోజనం చేకూరకుండా ఉండేలా వైసిపి నేతలు, కార్యకర్తలు నాలుగు వైపుల నుంచి వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ వైసిపి వ్యూహాలను ఎలా తిప్పి కొట్టి ప్రజల్లోకి బలంగా వెళ్తారు అనే దానిపైన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు