Burning Feet: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామందికి అరికాళ్ళలో మంట ఏర్పడుతూ నడవడానికి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలా అరికాళ్ళ మంటల సమస్యతో బాధపడేవారు ఎన్నో రకాల మందులను వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అలాంటి వారు ఈ చిన్న చిట్కాలను కనుక పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అరికాళ్ళలో మంటలు ఏర్పడేవారిలో రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బ తినటం వల్ల ఇలా మంటలు ఏర్పడుతుంటాయి. అలాగే విటమిన్ బి12 లోపం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కాళ్ళను సుమారు ఆరు నిమిషాల పాటు పెట్టాలి. అనంతరం మరో నాలుగు నిమిషాలు చల్లనీటి గిన్నెలోకి కాళ్ళను పెట్టాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.
Burning Feet:
ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అదేవిధంగా గుమ్మడికాయ మిశ్రమంతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. గుమ్మడికాయ మిశ్రమాన్ని అరికాళ్ళకు రాసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి వేడి నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేయటం వల్ల ఈ అరికాళ్ళ నొప్పులు మంట సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఈ చిట్కాలతో మీ సమస్యను దూరం చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా నడవవచ్చు.