Vastu Tips: సాధారణంగా మనం ఆర్థికంగా బాగా ఎదగడానికి ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాము ఇలా ఎంత కష్టపడి పని చేసినా కొన్నిసార్లు మన చేతిలో రూపాయి కూడా నిలబడదు. ఇలా కష్టపడి పని చేసినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇలా కష్టపడి పనిచేసిన చేతిలో రూపాయి మిగలలేదు అంటే తప్పనిసరిగా వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము ఇలా వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావిస్తూ ఉంటారు.

ఈ విధంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తాము ఈ వాస్తు పరిహారాలలో కర్పూరంతో చేసే ఈ పరిహారం వల్ల ఆర్థిక ఇబ్బందులు మొత్తం తొలగిపోయి జీవితంలో ఎంతో సంతోషంగా గడపవచ్చు. మరి కర్పూరంతో ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే ప్రతిరోజు సాయంత్రం కర్పూరంతో పాటు మన ఇంటిలో దొరికే లవంగాలను ఒక అయిదు తీసుకొని ధూపం వేయాలి.
ఇలా ఇల్లు మొత్తం ధూపం వేసిన తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.డబ్బు సమస్యలతో పాటు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే బిర్యానీ ఆకును కర్పూరంతో కలిపి కాల్చడం వల్ల కూడా ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అందుకే కర్పూరంతో పాటు ఈ రెండింటిని వేసి కాల్చడం వల్ల ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

