Buddha Pournami: ప్రతి ఏడు గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా వైశాఖ మాసం పౌర్ణమి రోజున బుద్ధ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ ఏడాది మే 05, 2023న బుద్ధ పూర్ణిమ వస్తుంది. ఈ ఏడాది గౌతమ బుద్ధుని 2585వ జయంతి సందర్భంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తారు. ఈ సారి బుద్ధ పూర్ణిమ చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున మీకు రెట్టింపు ఫలాలు లభిస్తాయి. అదే సమయంలో, ఈ రోజున కూర్మ జయంతి కూడా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఇది శ్రీ హరి విష్ణువు తొమ్మిదవ అవతారం. ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ శుభ సమయం మే 04వ తేదీ ఉదయం 11.44 నుండి మే 05 రాత్రి 11.03 వరకు ఉంటుంది.
ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి బుద్ధ పౌర్ణమి రోజు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• అనుకున్న పనులు నెరవేరకపోయినా, ఆర్థిక సమస్యలు వేధిస్తున్న కూడా బుద్ధ పూర్ణిమ శుభ సమయంలో, పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా ఆ వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడని ప్రజల నమ్మకం. అంతేకాకుండా బుద్ధ పౌర్ణమి రోజున ఇంట్లో గంగాజలం చల్లడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.’
Buddha Pournami:
• అలాగే బుద్ధ పౌర్ణమి రోజున చంద్ర దేవ్ పట్ల శ్రద్ధ వహించాలి. వెండి పళ్లెంలో నెయ్యి దీపం, ధూపం వెలిగించి పండ్లు, ఎండు ఖర్జూరాలు ఉంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే సాగో ఖీర్ అర్పించి చంద్రదేవుని ధ్యానించాలి. ఇలా చేయటం వల్ల చంద్రదేవుని అనుగ్రహాన్ని పొంది మీరు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి.
• అలాగే ఈ రోజు పుణ్యక్షేత్రానికి వెళ్లి, నల్ల నువ్వులు కలిపిన నీళ్లను పిడికెడు తీసుకుని, పూర్వీకుల పేరిట సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైషమ్యాలు, అశాంతి తొలగిపోతాయి. అంతే కాకుండా ప్రతికూలత కూడా నశిస్తుంది.