BRS Party: బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఖమ్మంలో బహిరంగ సభ తర్వాత తాజాగా మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభని నిర్వహించారు. ఈ సభలో కొంత మంది మరాఠీ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలు తీసుకొస్తా అని అక్కడ హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్న ఏపీలో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రభావం చూపిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.
టీఆర్ఎస్ పాలనని వారు దగ్గరుండి చూడటంతో కచ్చితంగా తమకి ఏపీలో ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ని కేసీఆర్ ఖరారు చేశారు. నిజానికి ఇంకా ఏ రాష్ట్రానికి కూడా పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేయలేదు. తెలంగాణ తర్వాత ఏపీకి మాత్రమే అధ్యక్షుడిని ఖరారు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో పార్టీ విస్తరణలో భాగంగా విశాఖ వేదికగా భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ వేదిక ఏర్పాటు ఖరారు అయిపొయింది.
అయితే ఎప్పుడు బహిరంగ సభ నిర్వహించాలనే విషయం ఇంకా ఖరారు ఖాలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న మాటలు బట్టి ఫిబ్రవరి మూడో వారంలో లేదంటే మార్చి మొదటి వారంలో తీరంలో బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సభ కోసం ఇప్పటికే ఉత్తరాంద్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకి తోట చంద్రశేఖర్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ బహిరంగ సభ కోసం తోట చంద్రశేఖర్ భారీగానే ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సభ ద్వారా తన సత్తా చూపించాలని తోట కూడా భావిస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ సభలో కొంత మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గాన్ని కూడా అదే రోజు ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.