Wed. Jan 21st, 2026

    BRS Party: తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలం నుంచి అసమతి స్వరం వినిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన అనుచరులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించుకోవడానికి రెడీ అవుతున్నారు. మొన్నటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్న టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అతనిపై సీరియస్ యాక్షన్ చేసుకోవడం విశేషం. ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పొంగులేటి వెంట ఉండడంతో ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

    Jupally Krishna Rao, మాజీ మంత్రి జూపల్లికి టీఆర్ఎస్ ఝలక్! - ex minister  jupally krishna rao feels sad on trs high command decision - Samayam Telugu

    ఇప్పటికే ఇద్దరు నేతలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ సర్కార్ పై అసమ్మతి స్వరం వినిపిస్తూ వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరుసగా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహిస్తూ నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా సస్పెండ్ చేశారు.

    I stayed for KTR': Setback for BRS as Ponguleti Srinivas likely to join BJP  | The News Minute

    ఇదిలా ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఈ ఇద్దరు నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో త్వరలో బిజెపి గూటికి చేరేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పార్టీలో చేరిపోతున్నట్లుగా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. జూపల్లి కృష్ణారావుని కూడా బిజెపి సంప్రదిస్తూ ఉంది. వీరిద్దరూ భారతీయ జనతా పార్టీలో చేరితే మాత్రం కచ్చితంగా తెలంగాణలో ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని చెప్పొచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తన పార్టీలోకి వస్తారని వైయస్సార్టీపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆశలు పెట్టుకుంది. ఊహించిన విధంగా ఇప్పుడు షర్మిల కి పొంగులేటి షాక్ ఇచ్చారని చెప్పాలి.