Brown Bread: సాధారణంగా చాలామంది ఉదయం టిఫిన్ చేసుకోవడానికి బద్దకిస్తూ ఎక్కువగా బ్రెడ్ బటర్ వేసుకొని తింటూ ఉంటారు. అయితే చాలామంది వైట్ బ్రెడ్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మనకు మార్కెట్లో బ్రౌన్ బ్రెడ్ దొరికిన చాలామంది వైట్ బ్రెడ్ తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలా తినడానికి వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదా లేక బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదా అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. బ్రౌన్ బ్రెడ్ తినడానికి చాలామంది ఆసక్తి చూపించరు కానీ ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బ్రెడ్ లో చాలా రకాలు ఉన్నాయి. మల్టీ గ్రైన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ ఇలా అనేక రకాల బ్రెడ్లు తినే వాళ్ళు ఉన్నారు. అయితే ఎక్కువగా వైట్ బెడ్ తినడానికి ఆసక్తి చూపుతారు.వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనిలో అధికంగా మైదానే ఉంటుంది. దీంతో శరీరంలో పిండి పదార్థం అధికంగా చేరుతుంది. బయట ఎక్కువగా తినేవారు అధిక రక్తపోటుకు గురి కావడమే కాకుండా గుండె జబ్బులతో కూడా బాధపడుతుంటారు. అలాగే తొందరగా శరీర బరువు కూడా పెరుగుతారు. వీటిలో ఏ విధమైనటువంటి పోషక పదార్థాలు ఉండవు.
Brown Bread:
వైట్ బ్రెడ్ తినడం వల్ల ఆకలి తీరడం తప్ప ఏ విధమైనటువంటి పోషకాలు మనకు అందవు కానీ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల ఇందులో ఉన్న ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే దీన్ని తినడం వల్ల విటమిన్ కె, విటమిన్ ఈ, విటమిన్ బి, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. మానసిక ఆరోగ్యానికి కూడా బ్రౌన్ బ్రెడ్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రోజుకు 1 లేదా రెండు ముక్కలు తింటే చాలు. మెదడు సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోను ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ బ్రెడ్ తినడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.