Wed. Jan 21st, 2026

    Bramha Muhurtham: సాధారణంగా మనం ఏదైనా పండగల సమయంలోను లేదా పూజ సమయంలోనే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి పూజలు చేయాలి అని చెబుతుంటారు. అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్తములు ఏ సమయంలో వస్తుంది ఈ బ్రహ్మ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనే విషయానికి వస్తే… పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు..

    ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. ఇలా సూర్యోదయానికి మొదటి వచ్చే ముహూర్తాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తానికి ఆదిదేవత బ్రహ్మ కనుక దీనిని బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు.

    Bramha Muhurtham:

    ఈ ముహూర్తం ఎంతో పవిత్రమైనది కనుక మనం ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలన్న ఏ విధమైనటువంటి మంచి పనులు చేయాలన్న ఈ బ్రహ్మ ముహూర్తంలో చేయటం వల్ల ఆ పనులలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా పనులు ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతాయని అందుకే బ్రహ్మ ముహూర్తంలోనే పనులు ప్రారంభించాలని చెబుతారు. ఇక బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి చదువుకోవడం వల్ల కూడా ఎంతో మంచి జ్ఞానం కలుగుతుందని పండితులు తెలియజేస్తుంటారు.