Brain Tumer: ప్రస్తుత కాలంలో అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్ ట్యూమర్ సమస్య కూడా ఎక్కువగా వేధిస్తోంది. శరీరంలో ఇతర భాగాలతో పాటు బ్రెయిన్ లో కూడా ఈ ట్యూమర్స్ ఏర్పడతాయి. అయితే బ్రెయిన్ లో ట్యూమర్స్ ఏర్పడటం చాలా ప్రమాదకరం. మనకి ఉన్న కొన్ని అలవాట్ల వల్ల ఈ బ్రెయిన్ ట్యూమర్ సమస్య తలెత్తుతుంది. అలాగే కొంతమందిలో వంశపారంపర్య వ్యాధులు, జీన్స్, అయోనైజింగ్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ వంటి కారణాల వల్ల ఈ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌కు కారణమయ్యే ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• ఆహారం, జీవనశైలి: మన జీవనశైలి ఆహారపు అలవాట్లు వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ సమస్య తలెత్తుతుంది. స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అధికంగా కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోవటం, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
• సెల్‌ఫోన్: ప్రస్తుత కాలంలో ఆహారం లేకపోయినా బ్రతుకుతున్నారు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఒక్కరోజు కూడా జీవించలేనంతగా సెల్ ఫోన్ కి బానిసలుగా మారిపోయారు. సెల్‌ఫోన్ నుంచి విడుదల అయ్యే రేడియేషన్ కారణంగా ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉందంటుంది.
• హార్మోన్లు: శరీరంలో హార్మోన్ల లోపం, అలాగే దీర్ఘకాలం పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకునే వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్న వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Brain Tumer:
• రసాయనాలు : పురుగుమందులు, పారిశ్రామిక రసాయనాలకు ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి, పారిశ్రామిక ప్రాంతాల సమీపంలో నివసించే వారికి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ.