Categories: LatestMoviesNews

Movies: బాలీవుడ్ ని భయపెడుతున్న బ్యాన్ సౌండ్… ఇప్పుడు పఠాన్ ని తాకింది

Movies: ఏ ముహూర్తంలో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడో కాని అప్పటి నుంచి బాలీవుడ్ ఇమేజ్ మసకబారుతూ వస్తుంది. బాలీవుడ్ పరిశ్రమలు హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరూ రెండు గ్రూపులుగా విడిపోయారు. నెపోటిజం బ్యాచ్ ఒకటి కాగా, వారిని వ్యతిరేకిస్తూ సొంత టాలెంట్ తో సక్సెస్ అందుకున్న వారు ఒక బ్యాచ్ గా మారిపోయారు. అలాగే హిందుత్వ భావజాలంతో ఉన్న వారంతా ఒక బ్యాచ్ గా ఉంటే, సెక్యులర్స్ అనుకుంటూ హిందుత్వంపై అలాగే బీజేపీ పార్టీని వ్యతిరేకించే వారు అందరూ ఒక బ్యాచ్ గా ఉన్నారు. ఈ నేపధ్యంలో సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ సినిమాలని చూసి ఇష్టపడే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది.

ఫారిన్ ఐడియాలజీకి కనెక్ట్ అయ్యి, హిందీ సినిమా అంటే రొమాన్స్, మసాలా, హీరోయిన్స్ బికినీ అందాలు మాత్రమే అనేలా మారిపోయింది. కంటెంట్ తగ్గిపోయి కలరింగ్ ఎక్కువ అయిపొయింది. అసలుకే నెపోటిజంని ద్వేషిస్తూ సుశాంత్ మరణానికి వారే కారణం అంటూ ఆ సెలబ్రిటీ కుటుంబాల నుంచి వచ్చే హీరో, హీరోయిన్స్ సినిమాలని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకునే కంటెంట్ లేని సినిమాలతో దారుణంగా దెబ్బ తింటున్నారు. దీంతో బ్యాన్ బాలీవుడ్ సినిమా అనే ట్రెండింగ్ కి ఊతం ఇచ్చే విధంగా వారి సినిమా ప్రయాణం సాగుతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూడేళ్ళ కాలంలో సక్సెస్ అయిన సినిమాలు అంటే వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఓ వైపు సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులని మెప్పిస్తూ వందలాది కోట్ల రూపాయిలు కలెక్ట్ చేస్తున్నాయి. అయితే హిందీ సినిమాలు మాత్రం క్రమక్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతున్నాయి. వాటిని సౌత్ సినిమా పూర్తిగా డామినేట్ చేస్తుంది. ఇదే దీనిపై బాలీవుడ్ దర్శకులు సైతం తమ ఈర్ష్య చూపిస్తూనే ఉన్నారు. సౌత్ సినిమా మోజులో పడితే హిందీ సినిమా పూర్తిగా తన వెలుగుని కోల్పోతుందని కొంతమంది బాలీవుడ్ దర్శకులు అంటున్నారు.

కంటెంట్ ఉన్న సినిమాకి ఎక్కడైనా ఆదరణ ఉంటుందని ది కాశ్మీర్ ఫైల్ సినిమా ప్రూవ్ చేసింది. దీనిని నిర్మించింది సౌత్ నిర్మాతలే కావడం విశేషం. బాలీవుడ్ సినిమా ఫెయిల్ కావడానికి కారణం అక్కడ నిర్మాణం రంగంలోకి కార్పోరేట్ కంపెనీలు వచ్చాయని, వారు ఇచ్చే రెమ్యునరేషన్ కి ఆశపడి కంటెంట్ లేని స్క్రిప్ట్ లు కూడా హీరోలు ఓకే చెబుతున్నారని తాజాగా రాజమౌళి కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బ్యాన్ బాలీవుడ్ సినిమా అనే ట్రెండ్ షారుఖ్ ఖాన్ సినిమాపై పడింది. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ అనే సినిమా చేశాడు. ఈ మూవీలో దీపికా పదుకునే నటించింది. అయితే ఈ మూవీకి సంబందించిన ఒక సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో దీపికా పదుకునే, షారుక్ ఖాన్ స్టిల్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయనేది నెటిజన్ల కామెంట్స్. అసలు అంత జుగుప్సాకరంగా విజువల్స్ ఎలా చిత్రీకరించారు అంటూ సాంగ్ పై విమర్శలు చేస్తున్నారు. భారతీయ విశ్వాసాలని కించపరిచే విధంగా ఈ విజువల్స్ ఉన్నాయని బీజేపీ మంత్రి కూడా కామెంట్స్ చేయడం విశేషం. ఇప్పుడు ట్విట్టర్ లో బ్యాన్ పఠాన్ మూవీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఆ సాంగ్ లో దీపికా, షారుక్ ఖాన్ స్టిల్స్ ని షేర్ చేస్తూ బ్యాన్ పఠాన్ మూవీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీని, అక్కడి హీరోలని ఇప్పుడు ఒక వర్గం ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అని ఈ బ్యాన్ ట్రెండ్ అనేది మరోసారి ప్రూవ్ చేసింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

5 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

7 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.