Black Thread: ఒకప్పుడు చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉండటం కోసం పెద్దవాళ్లు నుదుటిన పెద్ద ఎత్తున నల్ల బొట్టు పెట్టేవారు. అలాగే చేతులకు నల్లపూసలు వేసేవారు. కాలికి కూడా నల్లటి దారం కట్టేవారు.ఇలా నల్లపూసలు వేయటం వల్ల ఎవరి దిష్టి తగలకుండా చిన్నపిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో నల్లదారం కాలికి కట్టుకోవడం ఫ్యాషన్ అయింది.చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు నల్ల దారం కాలికి కట్టుకోవడం మనం చూస్తుంటాము.
ఇలా నల్ల దారం కాలికి కట్టుకోవడం వల్ల వారిపై నరదృష్టి ప్రభావం ఉండదని భావిస్తూ ఉంటారు. అందుకే కాలికి నల్ల దారం కట్టుకోవడం మంచిదని పెద్దలు కూడా చెబుతుంటారు.అయితే కాలికి నళ్ళదారం కట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా కట్టుకోకూడదని ఈ దారం కట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించడం వల్ల మనపై ఎలాంటి ప్రభావం పడదని పండితులు చెబుతున్నారు. మరి నల్ల దారం కాలికి కట్టే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి అనే విషయానికి వస్తే…
Black Thread:
దిష్టి తగలకుండా కాలికి నల్ల దారం కట్టుకునేవారు కేవలం అమావాస్య రోజు మాత్రమే కట్టుకోవాలి. అమావాస్య రోజు నల్లదారం కాలికి కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అమావాస్య రోజు నల్లదారం కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక చాలామంది ఆ నల్ల దారాన్ని కొన్ని నెలలు సంవత్సరాలు పాటు అలాగే ఉంచుకుంటారు. ఇలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది అందుకే ప్రతి నెలకొకసారి దారం మార్చడం ఎంతో అవసరం. అమావాస్య ముందు రోజు దారం తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి, నరదిష్టి ప్రభావం మనపై ఉండదని తెలుస్తుంది.