Beauty Tips: ప్రస్తుత కాలంలో అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా అందంపై ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఇలా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అందంగా కనిపించడం కోసం పెద్ద ఎత్తున పార్లర్ కి వెళ్తూ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి అందాన్ని పెంపొందింప చేసుకుంటూ ఉంటారు. ఇలా తమ అందం రెట్టింపు అవ్వడం కోసం అబ్బాయిలు అమ్మాయిలు వేలకు వేలు డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనకాడరు.
ఇలా చాలామంది డబ్బు ఖర్చుపెట్టిన సరైన ఫలితాలు లేక నిరుత్సాహపడుతూ ఉంటారు అయితే ముఖంపై ఏ విధమైనటువంటి మచ్చలు లేకుండా సహజ సిద్ధంగా మన చర్మం కాంతివంతంగా మెరవాలి అంటే మన ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాతో మన ముఖ సౌందర్యాన్ని పెంపొందింప చేసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పాలు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొహంపై రాసుకోవాలి.
ఇలా ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో మొహం శుభ్రం చేసుకోవాలి ఇలా వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు చేసినా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. పాలు బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి అలాగే శరీరం బయట, లోపల కూడా క్లెన్సర్‌లా పనిచేయటమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి మృత కణాలను బయటకు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి తద్వారా మన మొహం ఎంతో కాంతివంతంగా ఉంటుంది..