Health: మన జీవితంలో రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు చాలా మార్పు చెందాయి. ముఖ్యంగా సిటీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిన జనాలు ఉదయం నిద్ర లేచింది మొదలు ఉద్యోగ బాధ్యతలపై పరుగులు పెడుతూ ఉంటారు. అలాగే సమయానికి ఆహారం, నిద్ర కూడా ఉండటం లేదు. రాత్రి సమయంలో ఉద్యోగాలు చేసే వారు కూడా ఉన్నారు. ఇలా రోజువారి లైఫ్ స్టైల్ లో మార్పులు కారణంగా తక్కువ వయసులోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
అయితే మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి. మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. నల్ల ద్రాక్ష కాస్త పుల్లగా ఉంటుంది అని పెద్దగా తినడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. అయితే ద్రాక్ష జ్యూస్ మాత్రం తాగుతారు.
నల్లని ద్రాక్షలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ద్రాక్షలో విటమిన్లతో పాటు పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి రోగ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న పోషకాలు శారీరక బరువును నియంత్రిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో ద్రాక్ష తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే నల్లద్రాక్ష గుండెల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి హృద్రోగ సమస్యలను కూడా నియంత్రిస్తాయి. అధిక రక్తపోటును, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తగ్గించడంలో నల్ల ద్రాక్ష ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని తెలుస్తుంది. అలాగే ద్రాక్ష శరీరంలో క్యాన్సర్ కణాలను వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి. కడుపు మంట, ఎసిడిటి సమస్యలు బాధపడేవారు ప్రతిరోజూ ద్రాక్ష రసం తీసుకుంటే మంచిది.
అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు మలబద్ధకం ఉన్నవారు కూడా ద్రాక్ష రసం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన కూడా దూరం చేయడంలో ద్రాక్ష ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి ఎన్నో రకాల శారీరక సమస్యల నుంచి నల్ల ద్రాక్ష మనల్ని బయట పడేస్తాయి. ఈ కారణంగానే డాక్టర్లు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ద్రాక్ష రసం తీసుకోమని సూచనలు చేస్తారు.