Black Cardamom: మన వంటింట్లో దొరికే సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. మనం ఎక్కువగా పచ్చ రంగులో ఉండే యాలకులు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే యాలకులలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో నల్ల యాలకులు కూడా ఒకటి. వీటిని చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ నల్ల యాలకుల వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే మాత్రం ఉపయోగించకుండా అసలు ఉండలేరు. ఈ నల్ల యాలకులను ఎక్కువగా పులావ్, బిర్యానీ, భగారా లాంటి ఆహార పదార్థాల్లో వాడుతారు.
వీటిని సువాసన కోసం రుచి కోసం ఎక్కువగా బిర్యానీ లాంటి వంటకాల్లో వాడుతుంటారు. మరి నల్ల యాలకుల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. నల్ల యాలకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాటిని ఔషధంగా ఉపయోగిస్తారు. చాలా ఆయుర్వేద మందుల్లో నల్ల యాలకులను ఉపయోగిస్తారు. నల్ల యాలకుల వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిని నిత్యం తీసుకోవాలి. రోజూ వండుకునే ఆహారంలో నల్ల యాలకులను వాడితే ఎంతో మంచిది. నల్ల యాలకుల వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అందుకే నల్ల యాలకులను బ్యూటీ ప్రాడక్ట్స్ ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు.
నల్ల మిరియాలలో ఉన్న కార్మినేటివ్ అనే పదార్థం కడుపులో ఉన్న గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. బాగా ఆకలి వేయకున్నా నల్ల యాలకులను తీసుకుంటే చాలు. ఆకలి దంచేస్తుంది. జీర్ణ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. చాలామందికి నోటి నుంచి చెడు వాసన వస్తుంటుంది. అటువంటి వాళ్లు నల్ల యాలకులను తింటే చాలు. దాంట్లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు,చెడు వాసనను పోగొడతాయి. చాలామందికి శరీరంలో ఆమ్లత్వం సమస్య వస్తుంది. దాని వల్ల్. అనేక వ్యాధులు వస్తాయి. ఆ సమస్య పోవాలంటే నల్ల యాలకులను తినాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.