Wed. Jan 21st, 2026
    bjp-kapu-plan-in-ap-politicsbjp-kapu-plan-in-ap-politics

    AP Politics: ఏపీలో రానున్న ఎన్నికలలో అధికారంలోకి రావడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు వారు వేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. అధికార పార్టీ సంక్షేమాన్ని నమ్ముకుంటే టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని నమ్ముకుంది. జనసేన యువతని, కాపుల నమ్ముకొని రాజకీయాలు చేస్తుంది. ఇక బీజేపీ పార్టీ కూడా కాపులపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. ఎప్పటి నుంచి వారు రాజ్యాధికారం కోసం చూస్తున్నారు. అయితే సరైన నాయకత్వం ఆ వర్గంలో లేకపోవడం వలన వారి ఆశలు నెరవేరడం లేదు. వంగవీటి రంగాతో రాజ్యాధికారం వస్తుందని అనుకుంటే అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం వ్యూహాత్మకంగా అతనిని హత్యచేశాయి అనే అభిప్రాయం కాపులలో ఉంది.

    bjp-kapu-plan-in-ap-politics
    bjp-kapu-plan-in-ap-politics

    ఇక చిరంజీవి ప్రజారాజ్యంతో రాజ్యాధికారం కోసం ఆశ పడ్డారు. అయితే ఆయన కూడా ప్రత్యర్ధుల వ్యూహాలలో చిక్కుకొని పార్టీని కాంగ్రెస్ లో కలిపేసారు. ఇప్పుడు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ కాపులకి నాయకుడిగా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని కాపులు ఎవరూ నమ్మలేదు. కాని ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం కాపులు అందరూ ఐక్యం అవుతున్నట్లు తెలుస్తుంది. గ్రౌండ్ లెవల్ లో ఇప్పటికే కాపు నాయకులు జనసేనకి సపోర్ట్ గా అందరిని ఏకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ కాపు మంత్రం జపిస్తుంది.

     

    కొద్ది రోజుల క్రితం ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ ఏపీలో అత్యంత అన్యాయానికి గురైనవారు ఎవరైనా ఉన్నారా అంటే అది కాపులే అని పేర్కొన్నారు. తాజాగా రాజ్యసభలో జీవో అవర్ లో వంగవీటి మోహనరంగా పేరు ప్రస్తావించారు. ఏపీలో జిల్లాల విభజన జరిగినపుడు వంగవీటి పేరు ఒక జిల్లాకి పెట్టాలని కాపులు కోరుకున్నారని తెలిపారు. అయితే వైసీపీ దానిని విస్మరించిందని అన్నారు. కేంద్రం జోక్యం చేసుకొని ఒక జిల్లాకి వంగవీటి పేరు పెట్టడం ద్వారా కాపు యువత ఆశలని నెరవేర్చాలని కోరారు.

     

    ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఒక్కసారిగా కాపులపై బీజేపీకి ప్రేమ రావడం వెనుక ఎన్నికల వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తుంది. రానున్న ఎన్నికలలో కాపుల ఓటుబ్యాంకు జనసేన, బీజేపీకి కలిసి రావాలంటే కేంద్రం నుంచి ఆ వర్గానికి కొంత సానుకూలమైన పనులు జరగాలని భావించి జీవీఎల్ ప్రస్తావించినట్లు తెలుస్తుంది.