BJP: దేశ రాజకీయాలలో కాషాయం జెండా, హిందుత్వ అజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోనే బీజేపీ ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా ఉంది. నరేంద్ర మోడీని సమర్దవంతంగా ఎదుర్కొనే బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో లేదు. రాహుల్ గాంధీ ఉన్నా కూడా అతని బలం ఏమో కాని, అతని మాటలతో ప్రజలకి మరింత దూరం అవుతున్నారు. హిందుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, సావర్కర్ మీద అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దుని దేశం మొత్తం సమర్ధిస్తూ ఉంటే రాహుల్ గాంధీ మాత్రం తాము అధికారంలోకి వస్తే దీనిని అమల్లోకి తీసుకొస్తామని చెబుతున్నారు.
ఇలా రాహుల్ గాంధీ చేసే మాటలు అన్ని కూడా ప్రజల కాంగ్రెస్ పార్టీ పట్ల, రాహుల్ నాయకత్వం మీద నమ్మకంగా లేరు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా మోడీ ఇంటి పేరు మీద రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలని కోర్టు తప్పుపట్టడంతో నిందితుడిగా పేర్కొనడంతో అతనిపై అనర్హత వేటు వేసింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నార్త్ ఇండియాకి మాత్రమే పరిమితం అయిన బీజేపీ పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి కూడా మెల్లగా విస్తరిస్తుంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలంగా ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ విడుదల చేసింది. ఈ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి సింగిల్ గా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుంది.
అలాగే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎన్నడూ లేని స్థాయిలో బలంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉంది. ఇక కేరళలో కూడా బీజేపీ పార్టీ పుంజుకోవడం విశేషం. అలాగే తమిళనాడులో అన్నామలై నాయకత్వంలో బీజేపీ బలమైన శక్తిగా మారుతుంది. అన్నాడిఎంకే పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడంతో ఆ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఏపీలో మాత్రం బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. ప్రజలని ఆకర్షించే బలమైన నాయకుడు ఎవరు లేరు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఏపీని మోసం చేసిందనే అభిప్రాయం ప్రజలలో ఉంది. ఇది ఆ పార్టీకి ప్రతికూలంగా ఉంది. అయితే జనసేన పార్టీ సహకారంతో ఏపీలో కూడా బలపడాలని బీజేపీ చూస్తుంది. కాని అది ఎంత వరకు సాధ్యమనేది చెప్పలేం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.