BJP: కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఘోరపరాజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సంకీర్ణం లేకుండానే అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికలలో వంద స్థానాలలో గెలిచిన బీజేపీ 64 స్థానాలకి పరిమితం అయ్యింది. అయితే కర్ణాటకలో బీజేపీ ఓటమికి కారణం ఏంటి అనేది చూస్తే ప్రధానంగా తెలుగు ప్రజల ఎఫెక్ట్ గణనీయంగా ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఏకంగా 9 జిల్లాల వరకు ఉన్నాయి. వాటిలో 63 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వాటిలో కేవలం బీజేపీ 9 స్థానాలని మాత్రమే కైవసం చేసుకుంది. మిగిలిన అన్ని చోట్ల ఓడిపోయింది.
ముఖ్యంగా ఏపీ సరిహద్దు అసెంబ్లీ నియోజకవర్గాలలో అయితే బీజేపీ కంప్లీట్ గా తుడిచుకుపోయింది అని తెలుస్తోంది. దీనిని బట్టి ఏపీ ప్రజలు బీజేపీపై ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి ఊపిరి పోసే ప్రయత్నం చేస్తున్నారు. మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీతో కలిసి పోటీ చేస్తే వారి ఎఫెక్ట్ జనసేన మీద ఉంటుందని పవన్ కళ్యాణ్ కి క్లారిటీ వచ్చేసింది. దీంతో 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలని ప్రపోజల్ పెట్టారు.
అయితే గతంలో ఏపీ బీజేపీ నాయకులే టీడీపీతో పొత్తు అంటే అంతెత్తున లేచేవారు. ఇప్పుడు మాత్రం బీజేపీ తెలుగు రాష్ట్రాలలో బ్రతికి బట్టకట్టాలంటే జనసేనానే దిక్కు అనే మాట వినిపిస్తోంది. వారితో కలిసి ఉంటే 2029 ఎన్నికలలో అయిన మూడో ప్రత్యమ్నాయంగా ఏమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఉన్న ఆ 2 శాతం ఓటింగ్ కూడా పూర్తిగా కనుమరుగు అవుతుంది. అని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేనతో కలిసి వెళ్ళడం వైపే మొగ్గు చూపించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనేది చూడాలి.