BJP: ఏపీ రాజకీయాలలో రోజుకొక రచ్చ తెరపైకి వస్తుంది. అన్ని పార్టీలు ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికిన దానిని కరెక్ట్ గా పట్టుకొని ప్రజలలోకి బలంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా హిందుత్వ రాజకీయాలకి పెట్టింది పేరు బీజేపీ పార్టీ. ఆ పార్టీ హిందుత్వ అజెండాతోనే మతతత్వ రాజకీయాలు చేస్తుంది అనే అందరూ విమర్శించే మాట. అయితే మెజారిటీ ప్రజలని విశ్వసించే హిందూమతం హక్కులకి భంగం కలిగిస్తే తాము ప్రశ్నిస్తామని, పోరాటం చేస్తామని బీజేపీ చెప్పే మాట.
హిందుత్వ వాదనని బలంగా నమ్మేవారు బీజేపీ సిద్ధాంతాలని ఇష్టపడతారు. అయితే సెక్యులర్ గా ఉంటూ హిందుత్వ మూఢ నమ్మకాలని వ్యతిరేకించే వారు బీజేపీని తీవ్రంగా ద్వేషిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా మహాశివరాత్రి రోజున ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో ప్రజలని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే నిజమైన ఈశ్వరారాధన అంటూ ఒక ఫోటో పెట్టారు. అందులో బిచ్చగాడిగా ఉన్న బాలశివుడి నోట్లో జగన్ పాలు పోస్తున్నట్లు ఉంది. ఇక ఆ ఫోటోపై ఇప్పుడు బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకి పిలుపునిచ్చింది.
హిందువులను హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే ఆ పోస్టుని ట్విట్టర్ నుంచి తొలగించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. హిందువుల పందల సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గుర్తుకు వస్తాయా అంటూ విమర్శించారు. మహాశివరాత్రి రోజున హిందువులు శివలింగాకిని పాలాభిషేకాలు చేస్తారు. అలాగే పంచామృత అభిషేకాలు చేస్తారు. వాటిని వ్యతిరేకించే విధంగా ముఖ్యమంత్రి జగన్ పోస్ట్ ఉందని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శివాలయాల వద్ద బీజేపీ నాయకులు ఆందోళనలు చేయాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.